Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 26.

కామక్రోధవియుక్తానాం
యతీనాం యతచేతసామ్‌ |
అభితో బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనామ్‌ ||

తాత్పర్యము : కామ క్రోధముల నుండివిడివడనవారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమునము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్రించువారును అగు మహాత్ములు ఆచిర కాలములోనే బ్రహ్మనిర్వాణమును నిశ్చయముగా పొందుదురు.

భాష్యము : ముక్తిని పొందాలని ప్రయత్నించు సాధువులలో కృష్ణ చైతన్యవంతుడే ఉత్తముడు. ఎందువలననగా గొప్ప గొప్ప సాధుపుంగవులు తమ ఇంద్రియములని నియంత్రించుటకు అహర్నిశలు ప్రయత్నించుదురు. అయితే ఫలాపేక్ష ఎంత గాఢమైనదంటే తమ కోరికలను అదుపు చేయుట, అటువంటి వారికి సైతమూ బహు కష్ట తరమగును. కానీ భక్తుడు భగవంతుని పట్ల పూర్తి అవగాహనతో భగవత్సేవలో నిమగ్నుడగుట వలన అత త్వరలోనే ముక్తని పొందును. చేపలు తమ చేపు ద్వారా, అలాగే తాబేలు ధ్యానము ద్వారా తమ గుడ్లను పొదగును. అలా తాబేలు నీటిలో ఉండి ఒడ్డున ఉన్న గుడ్లను పొదిగినట్లు భక్తుడు ఈ భౌతిక ప్రపంచమున ఉండి సదా కృష్ణుని స్మరించుట ద్వారా, సేవించుట ద్వారా వైకుంఠ ప్రాప్తిని పొందగలుగును. ఈ విధమైన ”బహునిర్వాణ” స్థితి వలన, భక్తుడు భౌతిక బాధలకు అతీతముగా నిలువగలడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement