Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 23.

శక్నోతీహైవ య: సోఢుం
ప్రాక్‌శకరీరవిమోక్షణాత్‌ |
కామక్రోధోద్భవం వేగం
స యుక్త: స సుఖీ నర: ||

తాత్పర్యము : దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగినవాడు, కామక్రోధవేగమును అణచగలిగినవాడు దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగము నందు సుఖవంతుడగును.

భాష్యము : ఆత్మ సాక్షాత్కార మార్గమున పురోగతి కోరినచో వారు ఇంద్రియముల వేగమున నియంత్రించ వలసి వుంటుంది. అవి వాచో వేగము, మనస్సు వేగము, క్రోధ వేగము, జిహ్వ వేగము, ఉదర వేగము మరియు మర్మావయవాల వేగము అని పేర్కొనబడినవి. ఇలా నియంత్రించిన వారిని గోస్వామి లేదా స్వామి అందురు. అనగా వారు నియంత్రిత జీవనమును గడుపుచూ ఇంద్రియ వేగాలకు బానిసలు కాబట్టటి అదుపు చేసిన వారని అర్ధము. భౌతికమైన కోరికలు తీరకపోతే కోపమునకు దారి తీసి మిగిలిన ఇంద్రియాలు కూడా అదుపు తప్పేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని చాలించే లోపు భౌతిక కోరికలను మరియు కోపాన్ని నియంత్రించే పద్ధతిని తీవ్రముగా అవలంబించవలసి ఉంటుంది. ఈ విధమైన అభ్యాసము చేసే వారు ఆత్మ సాక్షాత్కాలుగా ఆనందముగా ఉండగలుగుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement