Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 22.

యే హి సంస్పర్శజా భోగా
దు:ఖయోనయ ఏవ తే |
ఆద ్యంతవంత: కౌంతేయ
న తేషు రమతే బుధ: ||

తాత్పర్యము : బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దు:ఖకారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయా! ఆ సుఖములు ఆతి, అంతములను కూడి యున్నందున తెలివిగలవాడు వాని యందు ప్రియమును పొందడు.

భాష్యము : భౌతిక ఆనందమనేది ఇంద్రియాల సంపర్కము వలన వచ్చేది. ఈ శరీరమే అశాశ్వతమైనది గనక ఇక ఇంద్రియాల వలన పొందెడి ఆనందమూ తాత్కాలికమైనదే. ముక్త స్థితిలో ఉన్న వ్యక్తికి దివ్యమైన ఆనందము గురించి తెలుసు కనుక తాత్కాలికమైన ఆనందమునకు ప్రాకులాడడు. ప్రతి జన్మలోనూ చివరికి జంతు జన్మలలోనూ లభించే భౌతిక సుఖానికి మానవ జన్మను వృధా చేయరాదు. మనావ జన్మ తపస్సు ద్వారా దివ్యమైన శాశ్వత ఆనందాన్ని పొందేందుకు ఉద్దేశించబడినదని శ్రీమద్భాగవగము తెలియ జేయుచున్నది. అట్లు కాక ఎంతైతే భౌతిక సుఖానికి ఒక వ్యక్తి ఆకర్షితుడవుతాడో అంత మేరకు భౌతిక దు:ఖాన్ని కూడా పొందవలసి ఉంటుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement