Tuesday, September 17, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 17.

తద్బుద్దయస్తదాత్మాన:
తన్నిష్ఠాస్తత్పరాయణా: |
గచ్ఛంతత్యపునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషా: ||

తాత్పర్యము : బుద్ధి, మనస్సు, నిష్ఠ, ఆశ్రమయులన్నియును భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును.

భాష్యము : దివ్యమగు పరమ సత్యమే శ్రీ కృష్ణుడు. భగవద్గీత ముఖ్య సందేశమే శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని తెలియజేయుట. అన్ని వేదాల సందేశము కూడా ఇదే. పరతత్త్వము లేదా పరమ సత్యాన్ని – బ్రాహ్మన్‌, పరమాత్మ, భగవంతుడుగా అర్ధము చేసికొందురు. భగవద్గీతలో ”నాకు మించినది ఏదీ లేదని”, ”బ్రహ్మమునకు కూడా నేనే ఆధార భూతుడను” అని తెలియుట ద్వారా భగవంతుడైన కృష్ణుడే పరమ సత్యమని అవగతమవుతుంది. ఇది అర్థము చేసికొని ఎవరైతే తమ మనస్సు, బుద్ధి, విశ్వాసాన్ని పెట్టి భగవంతున్ని ఆశ్రయిస్తారో వారి అపోహల్ననీ పటాపంచలు అవుతాయి. మనము భగవంతునిలో భాగమని, అంతేకాక భవిష్యత్తులో కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా కొనసాగిస్తామని తెలుసుకున్న వ్యక్తి స్థిరముగా ముక్తి పథములో కొనసాగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement