అధ్యాయం 5, శ్లోకం 16.
జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశితమాత్మన: |
తేషామాదిత్యవత్ జ్ఞానం
ప్రకాశయతి తత్పరమ్ ||
తాత్పర్యము : అజ్ఞానమును నశింపచేయు జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు, పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు, అతని జ్ఞానము సర్వమును వ్యక్త పరచును.
భాష్యము : చీకటి తొలగి వెలుతురు రాగానే మనకు అన్నీస్పష్టముగా కనిపించును. అదే విధముగా అజ్ఞానము కారణమున మనము మన గురించి, భగవంతుడు గురించి అనేక అపోహలు కలిగి ఉంటాము. కొందరు నేను భగవంతున్ని అని భావిస్తూ ఉంటారు. భగవంతున్ని అనే వారే మాయలో ఉన్నట్లయితే , మాయ భగవంతుని కంటే గొప్పదని భావము. మరి కొందరు నేను శరీరము కాదు అని తెలసినా ఆత్మ పరమాత్మల నడుమ గల బేదమును యెరుగుదురు. ఇంకొందరు భగవంతుడూ, మనమూ శాశ్వతముగా వేరు వేరు వ్యక్తులుగానే కొనసాగుతామని అర్ధము చేసుకొనలేరు. కాబ ట్టి శ్రీకృష్ణుని ప్రతినిధియైన గురువును ఆశ్రయించినట్లయితేనే ఇటువంటి అపోహలు తొలగి యదార్ధ జ్ఞానమును పొందగలుగుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..