Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 7.

యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మా జితేంద్రియ: |
సర్వభూతాత్మభూతాత్మా
కుర్వన్నపి న లిప్యతే ||

తాత్పర్యము : భక్తి యోగముతో కర్మ నొనరించువాడును, విశుద్ధాత్ముడు, ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు అందరికి ప్రియుడై యుండును. అందరి యెడ అతడు ప్రియమును కలిగి యుండును. అట్టివాడు సదా కర్మల నాచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు.

భాష్యము : యోగ యుక్తుడు లేదా భగవత్సేవలో నిమగ్నుడైన భక్తుడు అందరికీ ప్రియుడు, అట్టే అందరూ అట్టి భక్తునకూ ప్రియులే. ఎట్లన, కొమ్మలు, రెమ్మలు, ఆకులూ ఏవిధముగా చెట్టులో భాగములో అదే విధముగా అందరూ బగవంతుడిలో భాగమని, ఆయనను సేవించిన అందరినీ సేవించనట్లే గనుక అతడు సర్వులకు ప్రీతి పాత్రుడగును. అతని సేవచే అందరూ సంతృప్తి చెంది యుందురు గనక అతడు విశుద్ధాత్ముయగును. విశుద్ధాత్మయగుటచే మనస్సు సంపూర్ణముగా భగవంతునిపై లగ్నమై ఇంద్రియములు నియంత్రింపబడును. ఆవిధముగా అతడు ఎవ్వరికీ హాని తలపెట్టలేడు. అర్జునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞపై యుద్ధము చేయుట వలన అది సాధారణమైన యుద్ధము కాక భగవత్సేవ అగుటచే కర్మఫలములచే అర్జునుడు బద్ధుడు కాలేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement