అధ్యాయం 5, శ్లోకం 6.
సన్న్యాసస్తు మహాబాహో
దు:ఖమాప్తుమయోగత: |
యోగయుక్తో మునిర్బ్రహ్మ
నచిరేణాధిగచ్ఛతి ||
తాత్పర్యము : భక్తి యుత సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగము నందు నియుక్తుడైన వాడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.
భాష్యము : ఈ లోకము నందు రెండు రకాల సన్యాసులుందురు. వారిలో ఒకరు శంకర భాష్యము ఆధారముగా వేదాంత అధ్యయనములో నిమగ్నులయ్యే మాయావాద సన్యాసులైతే, రెండోవారు వేదాంత సూత్ర సహజ భాష్యమైన శ్రీమద్భాగవతాన్ని అనుసరిస్తూ పాంచరాత్ర విదానము ప్రకారము అనేక విధాలుగా భగవంతున్ని సేవిస్తూ ఉంటారు. చూడటానికి వారి కార్యాలు భౌతికముగా కనిపించినా, భగవంతునితో సంబంధమును కలిగి ఉండుటచే వారు సంతృప్తులై ఉందురు. అలా కాక మాయావాద సన్యాసులు చూడటానికి భౌతిక కార్యాలను వదలి శుష్కతర్కములో మునిగినట్లు కనిపించినా కొద్ది కాలానికే విసుగుచెంది, భగవతాన్ని పటించుదురు. భగవత్సేవా భావము లోపించుట వలన ఆసక్తి కోల్పోయి ఆత్మ సాక్షాత్కారాన్ని విడనాడి సామాజిక సేవా లేదా మానవ సేవలో నిమగ్నులగుదురు. ఇవి గొప్ప కార్యాల వలే కనిపించినా భౌతికమే గనుక మానసిక కల్పనా వైరాగ్యము కంటే భగవత్సేవ ఉత్తమమైనదిగా నిర్థారించవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..