అధ్యాయం 4, శ్లోకం 41
యోగసన్న్యస్తకర్మాణం
జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ ||
తాత్పర్యము : కర్మ ఫలములన్నింటిని త్యజించి భక్తి యోగము నందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములు నశించి యున్నవాడు వాస్తవముగా ఆత్మ యందే స్థితుడైనట్టివాడు. ఓ ధనుంజయా! ఆ విధముగా అతడు కర్మ ఫలములచే బందితుడు కాడు.
భాష్యము : దేవదేవుడైన శ్రీ కృష్ణునిచే తెలుపబడిన రీతిగా భగవద్గీతోపదేశమును అనుసరించువాడు దివ్యజ్ఞానము ద్వారా సర్వ సంశయముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో భగవానుని అంశరూపమున అతడు ఆత్మ జ్ఞానమునందు స్థితిని పొందినవాడేయగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మ బంధమునకు అతీతుడై యుండును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..