Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 34

34
తద్విద్ధి ప్రాణిపాతేన
పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శిన: ||

తాత్పర్యము : గురువు దరిచేరి సత్యము తెలుసుకొనుట కొరకై యత్నింపుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను చేయుము. ఆత్మ దర్శులు తత్త్వ దర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు.

భాష్యము : ధర్మమనేది భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. దానిని పాటించుటకు గురువు యొక్క శిక్షణ అత్యావశ్యకము. గురువును సమీపించి అతనిని శరణు పొందిన గాని జ్ఞాన సముపార్జన మొదలు కాదు. అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన గురువును సంతృప్తి పరచుటయే ఆధ్యాత్మిక జీవన పురోగతికి మూలాధారము. గురువు నుండి వినమ్రతతో వినుటయే కాక, అహంకారమును ప్రక్కన పెట్టి శ్రద్ధతో దాసుని వలె సేవ చేయవలెను. అలాగే సేవయే కాక వినమ్రతతో ప్రశ్నలు అడిగి స్పష్టమైన అవగాహనను పొందవలెను. ఎంతో దయాళువైన గురువు అటువంటి శిష్యునికి జ్ఞానమును ఇచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement