అధ్యాయం 4, శ్లోకం 31
31
యజ్ఞశిష్టామృతభుజో
యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకో స్త్యయజ్ఞస్య
కుతో న్య: కురుసత్తమ ||
తాత్పర్యము : ఓ కురు వంశ శ్రేష్టుడా! యజ్ఞమును నిర్వహింపకుండా ఎవ్వరును ఈ లోకమున గాని, ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి యెడ తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేల?
భాష్యము : ఈ భౌతిక జగత్తులో మన దుస్థితికి కారణము, మన సహజమైన వైకుంఠ స్థితిని మరచిపోవుటయే. ఆ అజ్ఞానము వలన జీవి పాపములు చేయును. ఆ విధముగా భౌతిక జీవనము కొనసాగుతూ ఉండును. కాబట్టి వేదాలు మనమీ జన్మమృత్యు చక్రము నుండి బయట పడుటకు అవకాశము ఇచ్చుచున్నవి. ధర్మాన్ని ఆచరించుట ద్వారా మనకు కావలసిన అర్ధాన్ని పొందవచ్చును. దానిని ధర్మ బద్ధముగా కామానికి వాడు కొన్నట్లయితే, పవిత్రులై ఈ భౌతిక జీవితము నుండి ముక్తులవ్వాలనే కోరికతో మోక్ష పథాన్ని అనుసరిం చే అవకాశము ఉంది. మరి అటువంటి వేదవాక్కులను ధిక్కరించి యజ్ఞములను నిర్వహించకపోతే ఆనందముగా ఎలా ఉండగలము? భౌతిక ఆనందములో అనేక తరగతులు ఉన్నాయి. అయితే వాటన్నిటి కంటే మించినది భగవద్ధామమును చేరుట వలన వచ్చేది. కాబట్టి భగవద్భక్తి చేయుటయే భౌతిక సమస్యలన్నిటికీ తగిన సమాధానము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..