అధ్యాయం 4, శ్లోకం 23
23
గతసంగస్య ముక్తస్య
జ్ఞానావస్థితచేతస: |
యజ్ఞాయాచరత: కర్మ
సమగ్రం ప్రవిలీయతే
తాత్పర్యము : ప్రకృతి త్రిగుణముల యెడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని స ర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును.
భాష్యము : భగవత్సేవా తత్పరుడు ద్వంద్వములకు అతీతుడగుటచే క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడివడును. కృష్ణుని సేవే తన జీవిత శాశ్వత లక్ష్యమని ఎరుగుటచే మనస్సు స్థిరపడి ముక్తికి అర్హుడగును. అతడు ఏది చేసినను కృష్ణుని కొరకు చేయును. విష్ణువు ప్రీత్యర్థమే యజ్ఞములన్నీ ఉద్దేశించబడినందున అతని కర్మల్నియును యజ్ఞరూపములే అగుచున్నవి. అట్టి యజ్ఞ రూపకర్మల ఫలములన్నియూ తప్పక దివ్యము నందు లీనమగుటచే వానిని చేసే వారెవరునూ కర్మ ఫలితములచే ప్రభావితులు కారు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..