Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 14
14
న మాం కర్మాణి లింపంతి
న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యో భిజానాతి
కర్మభిర్న స బధ్యతే

తాత్పర్యము : నన్ను ఏ కర్మయు ప్రభావితము చేయజాలదు. నేను యెట్టి కర్మ ఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు సైతము కర్మఫలములచే బంధింపబడడు.

భాష్యము : జీవుడు భోగవాంచ వలన ఈ భౌతిక ప్రపంచమున అనేక కర్మలు చేయును. అతని కోరికలకు, కార్యములకు అతడే భాద్యత వహించవలెను. తండ్రిగా, స ృష్టికర్తగా భగవంతుడు సౌకర్యములను, వసతులను మాత్రము ఏర్పాటు చేసి మనకు ధర్మోపదేశములను చేసెను. మన వలే అతనికి భౌతిక వాంచలు లేని కారణముగా ఆయన భౌతిక వసతులచే ప్రభావితుడు కాడు. కాబట్టి అతనికి కర్మ ఉండదు. ఉదాహరణకు భూమిపై ఉద్భవించు వృక్ష జాలమునకు వర్షము కారణము కాకున్నను, వర్షము లేకుండా అవి అభివృద్ధి చెందు అవకాశమే లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement