Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 11
11

nయే యథా మాం ప్రపద్యంతే
తాంస్తథైవ భజామ్యహమ్‌ |
మమ వర్త్మానువర్తంతే
మనుష్యా: పార్థ సర్వశ:

తాత్పర్యము : ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థా! ప్రతియొక్కరు అన్ని విధములా నామార్గమునే అనుసరింతురు.

భాష్యము : ప్రతి ఒక్కరూ భగవంతుడినే వేరు వేరు రూపములందు అన్వేషించుచున్నారు. నిరాకర బ్రహ్మముగా గాని, పరమాత్మగా గాని లేక భగవంతునిగా గాని ఇది కొనసాగుచున్నది. భక్తులు కూడా వేరు వేరు భావాలతో భగవంతుని వైకుంఠములోనూ కొలుచుచుందురు. వారి వారి భావాలకు తగ్గట్లుగా ఆయన కూడా, స్నేహితుడిగా, పుత్రుడుగా, ప్రియుడుగా వ్యక్తమగుచుండును. అలాగే ఈ భౌతిక జగత్తులో సైతము ఆరాధించేవారికి ఆయన తగిన విధముగా ప్రతి స్పందిస్తూ ఉంటాడు. భగవంతుడిలో లేదా బ్రహ్మములో లీనము కాగోరిన వారికి అటువంటి అవకాశాన్నిచ్చును. అయితే వారు భగవంతుని రూపమును స్వీకరించని కారణమున, సేవా ఆనందము పొందజాలలేరు. అలాగే యోగులకు కోరిన సిద్ధులను ఒసగును. యజ్ఞములను నిర్వహించువారికి యజ్ఞేశ్వరుడిగా కోరికలను తీర్చును. ఈ విధముగా వారి వారి అభీష్టాల ను తీర్చుకొనుటకు అందరూ ఆయన పైననే ఆధారపడి ఉన్నారు. అయితే చివరకు భగవత్సేవా అభిలాషను పెంపొందించుకొనని యెడల అన్ని ప్రయత్నములూ అసంపూర్ణములే కాగలవు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement