Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 08
8
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్‌ |
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే

తాత్పర్యము : సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును.

భాష్యము : సాధువనగా కృష్ణుడిని ప్రేమించే వ్యక్తి. దుష్క్రుతుడనగా కృష్ణుడిని ద్వేషించే వ్యక్తి. అట్టి వ్యక్తి మూర్ఖుడు, నరాధముడని భగవద్గీత యందు తెలియ జేయబడినది. వారు భక్తులను కూడా ద్వేషింతురు, పీడింతురు. అయితే వారిని సంహరించుట భగవంతునికి ఒక లెక్క కాదు. తన అనుచరులతో ఎవరి చేతనైననూ ఆ కార్యాన్ని సాధించగలడు. కానీ తన భక్తులకు ఆనందాన్ని కలుగజేయుటకై అయన స్వయముగా అవతరించి రెండు కార్యాలను అనగా సాధువులను రక్షించుట, దుష్టులను శిక్షించుట ఏక కాలములో చేయును. అనగా హిరణ్యకశిపుని చంపుట కంటే ప్రహ్లాదునికి ఆనందాన్ని ఇచ్చుటకే నృసింహావతారమున ఆయన అవతరించెను. ఇలా ఆయన పెక్కు అవతారములను దాల్చును. ప్రతి యుగమునా అవతరించును. ఈ యుగమున శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించునని ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీ మద్భాగవతపు గుహ్య భాగాలలో తెలుపబడినది. ఈ అవతారములో ఆయన సంకీర్తనము ద్వారా దుష్టులను సంహరింపక కరుణతో వారిని సైతమూ భక్తులుగా మార్చుదురని తెలుపబడినది. కాబట్టి అటువంటి హరినామ సంకీర్తనము అందరికీ శ్రేయస్కరము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement