అధ్యాయం 4, శ్లోకం 06
6
అజో పి సన్నవ్యయాత్మా
భూతానామీశ్వరో పి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ
సంభవామ్యాత్మమాయయా
తాత్పర్యము : జన్మలేనివాడ నైనను, నా దివ్యదేహము ఎన్నడు నశింపనిదైను, సకల జీవులకు ప్రభువునైనను ఆది యైన దివ్య రూపముతో నేను ప్రతియుగమునందును అవతరింతును.
భాష్యము : ఇచ్చట శ్రీకృష్ణుని జన్మ రహస్యము వివరించబడినది. సామాన్య మానవునిగా అవతరించినా ఆయన ఎప్పుడూ తన పూర్వ అవతారాలను మరచిపోడు. ఈ భౌతిక జగత్తులో ఉన్నా ఆయన ఎప్పుడూ పరమసత్యముగానే ఉండును. ఆయన రూపానికి ఆయనకు ఎట్టి తేడా ఉండదు. ఆయన ఎ ప్పుడూ నవయవ్వనుడిగానే కొనసాగును. ఆయన శరీరము గాని, బుద్ధి గానీ ఎన్నటికీ మార్పు చెందదరూ తరిగిపోదు. జీవుల మీద అపార కరుణతో శ్యామసుందరుడుగా, రెండు చేతులతో వేణువును ధరించి తన సహజ రూపములో ఈ ప్రపంచమున అవతరించి మన మనస్సును ఆయన దివ్య మంగళ విగ్రహముపై లగ్నము చేయుటకు అవకాశము ఇచ్చు చుండును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..