అధ్యాయం 4, శ్లోకం 05
5
శ్రీభగవాన్ ఉవాచ
బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి
న త్వం వేత్థ పరంతప
తాత్పర్యము : దేవ దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : ఓ పరంతపా ! నీకును మరియు నాకును ఎన్నో జన్మములు గడచినవి. నాకు అవి అన్నియును గుర్తు వున్నవి. కాని నీవు వానిని గుర్తు ఉంచుకొనజాలవు.
భాష్యము : దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక అవతారాలను, అనేక రూపాలను కలిగి ఉన్నాడని శాస్త్రాలు తెలియజేయుచున్నవి. అటువంటి ఒక అవతారములో సూర్య భగవానుడైన వివశ్వానునికి ఈ జ్ఞానము భోధించినప్పుడు అర్జునుడు కూడా వేరొక రూపంలో భగవానుని చెంతనే నిలిచి ఉన్నాడని మనకు ఈ శ్లోకము ద్వారా తెలి యుచున్నది. అయితే భగవానుని శరీరానికి ఆత్మకు ఎటువంటి భేధమూ లేదు కనుక ఆయన శరీరము మారనిది కన క ఆయన దేనినీ మరచిపోడు. కాని జీవి శరీరాలను మార్చును కనక మరచి పోవుటకు ఆస్కారమున్నది. గొప్పవీరుడూ, గొప్పభక్తుడై ముక్త స్థితిలో ఉన్న అర్జునుడు సైతమూ భగవంతుని వలే గుర్తుంచుకోలేకున్నాడు. అనగా భగవంతునితో జీవుడు ఎప్పుడూ సమానుడు కాలేడని ఇచ్చట తెలయజేయబడినది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..