Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 02
2
ఏవం పరంపరా ప్రాప్తమ్‌
ఇమం రాజర్షయో విదు: |
స కాలేనేహ మహతా
యోగో నష్ట: పరంతప

తాత్పర్యము : ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరరూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసి కొనిరి. కాని కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది.

భాష్యము : భగవద్గీతా జ్ఞానము యావత్‌ మానవాళికి ఒక గొప్ప వరమై ఉన్నది. ప్రత్యేకించి ప్రజా సంక్షేమాన్ని రక్షించు రాజులకు ఉద్ధేశించబడినదే గానీ నాస్తికులకు కాదు. వారు భగవంతుని ధిక్కరించి ఆయన సొత్తైన భగవద్గీతను తమ స్వంత ప్రయోజనమునకు వాడుకొనుటకే ప్రయత్నించుదురు. అటువంటి వారి వలన భగవద్గీతా ఉద్దేశ్యము నశించినట్లు కనిపించును. ఐదు వేల సంవత్సరముల క్రిందటనే శ్రీకష్ణుడు దీనిని గమనించి, భగవద్గీతను తానే స్వయముగా పునర్వచించెను. కాబట్టి గురు పరంపరానుగతముగానే భగవద్గీతను స్వీకరించవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement