Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 36
36
అర్జున ఉవాచ
అథ కేన ప్రయుక్తో2యం
పాపం చరతి పూరుష: |
అనిచ్ఛన్నపి వార్షేయ
బలాదివ నియోజిత: ||

అర్థము : అర్జునుడు పలికెను : ఓ వంశీ కృష్ణా! అయిష్టముగా నైన, బలమంతముగా పాపము చేయునట్లు మనిషిని ప్రేరేపించేదేమి?

భాష్యము : భగవదంశగా జీవుడు స్వతహాగా పవిత్రుడు, ఆధ్యాత్ముడు, కల్మషము లేనివాడు. అనగా ఈ భౌతిక జగానికి సంబంధించిన పాపములకు అతీతుడు. కానీ ప్రకృతితో సంపర్కములోనికి రాగానే నిస్సంకోచముగా రకరకాల పాపాలలో మునిగిపోవుచున్నాడు. కొన్నిసార్లు అయిష్టముగా బలవంతముగా కూడా చేస్తూ పోతూ ఉంటాడు. మరి ఆ బలవంతము చేస్తున్నది ఎవరు? (పరమాత్మా?) అని అర్జునుడు అడిగిన ప్రశ్న, బద్ధ జీవుల పరిస్థితి తగినదిగా ఉన్నది. రాబోవు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అసలు కారణాన్ని వెదకి, పరమాత్మ దానికి కారణం కాదని తెలియజేయనున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement