Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 32
32
యే త్వేతదభ్యసూయంతో
నానుతిష్ఠంతి మే మతమ్‌ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్‌
విద్ధి నష్టానచేతన: ||

అర్థము : కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరించని వారు మూఢులని, జ్ఞాన రహితులని, జీవితాన్ని సార్ధకము చేయు ప్రయత్నములో విఫలురుఅయిరని భావించవచ్చును.

భాష్యము : ఈ శ్లోకములో కృష్ణచైతన్యవంతులు కానివారి తప్పిదము స్పష్టముగా తెలుపబడినది. ఏ విధముగా నైతే ఒక అధికారి ఆదేశము దిక్కరించిననూ వ్యక్తి శిక్షర్హుడగునో, అట్లే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఆదేశము ను దిక్కరించిననూ తప్పక శిక్షార్హుడవుతాడు. తను ఎవరో, భగవత్‌ తత్వమేమిటో ఎరుగని వ్యక్తి హృదయశూన్యుడే కాగలడు. అట్టి వ్యక్తికి జీవిత లక్ష్యాన్ని సాధించే ఆస్కారము ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement