Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 30
30
మయి సర్వాణి కర్మాణి
సన్న్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా
యుధ్యస్వ విగతజ్వర: ||

అర్థము : కావున ఓ అర్జునా! నీవు కర్తవు కాదని ఎరిగి, ఫలములు నీవి కావని తెలుసుకొని, నా పట్ల సంపూర్ణ జ్ఞానము కలవాడవై కర్మలను నాకు అర్పింపుము. అట్లని ఇక కర్మ చేయుట ఎందుకు అనే అలసత్వాన్ని వదలి యుద్ధము చేయుము.

భాష్యము : ఈ శ్లోకము భగవద్గీత యొక్క ముఖ్య సందేశాన్ని స్పష్ట పరుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ తమ గుణ కర్మల ద్వారా నిర్వహించవలసిన విధులను కృష్ణ చైతన్యులో చేయుటయే ముక్తికి మార్గము కాగలదు. పరమాత్మ కోరుకున్నది నిర్వహించుటయే ఆత్మ యొక్క శ్రేయస్సు అని తెలుసుకొనుట ‘ఆధ్యాత్మ చేతస్సు’ అనబడితే, సర్వస్వమూ భగవంతునికే చె ందినది అని తెలసుకొని మనము కూడా బ్యాంకులో పని చేసే క్యాషియర్‌ రోజూ ఎంత ధనాన్ని లెక్కించినా తనకంటూ పైసా కూడా తీసుకోని విధముగా, ఫలముల నాశించకు భగవంతునికి అర్పించవలెను. అందువలన ఏది నాది కాదు అని అవగతము చేసుకొని భగవత్‌ చైతన్యములో, భగవదాదేశమును నిర్వహించుటకు ఎందురైన బంధనాలను, కష్టములను లెక్క చేయక ముందుకు కొనసాగాలి. ఇదే అర్జునునికి శ్రీకృష్ణుడు ఇస్తున్న ఆదేశము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement