Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 28
28
తత్త్వవిత్తు మహాబాహో
గుణకర్మవిభాగయో:
గుణా గుణషు వర్తంత
ఇతి మత్వా న సజ్జతే||

అర్థము : ఓ మహాబాహో ! తత్త్వ జ్ఞానము కలిగినవాడు, భగవంతుని కోసము చేసే కర్మకు, ఫలాసక్తితో చేసే కర్మకు నడుమ గల బేధమును గుర్తించి, ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తిని కలిగి యుండడు.

భాష్యము : తత్త్వ జ్ఞానమును అర్థము చేసుకున్న వ్యక్తి, నేను దేవాది దేవుడైన శ్రీ కృష్ణునిలో ఒక అంశమునని, శాశ్వత ఆనందముతోనూ, జ్ఞానముతోనూ ఉండవలసిన వాడినని, ఏదో విధముగా భౌతిక భావనలోఈ ఆధ్యాత్మిక జగత్తులో బంధీ అయినానని గుర్తించగలుగుతున్నాడు. తన సహజ స్థితిలో శ్రీకృష్ణుని దాసుడనని గుర్తించి భగవత్సేవలో నిమగ్నుడై, తాత్కాలికములైన పరిస్థితులని బట్టి మారు ఇంద్రియ భోగకార్యాల పట్ల ఆసక్తిని కోల్పోతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement