అధ్యాయం 3, శ్లోకం 23
23
యది హ్యహం న వర్తేయం
జాతు కర్మణ్యతంద్రిత: |
మమ వర్త్మానువర్తంతే
మనుష్యా: పార్థ సర్వశ: ||
అర్థము : ఓ పార్థా! ఒక వేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహించినచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.
భాష్యము : సంఘములో శాంతిని నెలకొల్పి తద్వారా అధ్యాత్మిక జీవితములో పురోగతి సాధించుటకు ప్రతి నాగరిక మానవునికి కొన్ని వంశాచారములు నిర్ణయింపబడినవి. కాని అట్టి నియమనిబంధనలు బద్ధ జీవునికి గాని శ్రీ కృష్ణునికి కావు. ఆయినను తాను ధర్మసంస్థాపనకై అవతరించి యున్నందున శ్రీకృష్ణుడు ఆ విహితకర్మలను అనుసరించెను. లేనిచో సామాన్యజనులు పరమ ప్రాణికుడైన శ్రీ కృష్ణున్నే అనుసరింపగలరు. గృహస్థునకు అవసరమైన ధార్మిక కర్మలను గృహమునందు మరియు గృహము వెలుపల శ్రీకృష్ణుడు నిర్వహించెనని శ్రీమద్భాగవతము ద్వారా అవగతమగుచున్నది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..