Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 22
22
న మే పార్థాస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కించన|
నానవాప్తమవాప్తవ్యం
వర్త ఏవ చ కర్మణి ||

అర్థము : ఓ పార్ధా! ఈ ముల్లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ ఏదీ నాకు లేదు. నేను కోరుకునేది గాని, పొందవలసినది గానీ ఏదీ లేకున్నా నేను నా విధులను నిర్వహిస్తూ ఉంటాను.

భాష్యము : భగవంతుడు సంపూర్ణుడు కనుక ఆయనకు చేయవలసిన బాధ్యత అంటూ ఏదీ లేదు. ఎవరైతే ఫలితాలను కోరుకుంటారో వారు ఆ ఫలితాలనిచ్చే కర్మను చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ముల్లోకాలలో ఏదీ కోరని వారికి ఏ కర్మ చేయవలసిన అవసరమూ ఉండదు. అలాంటి శ్రీ కృష్ణుడు ఒక క్షత్రియ నాయకునిగా కష్టాలలో ఉన్న ప్రజలకు రక్షణ ఇచ్చే నిమిత్తము కురుక్షేత్ర రణరంగమున పాల్గొనెను. అతడు శాస్త్ర నియమాలకు అతీతుడైనప్పటికీ, శాస్త్రాన్ని ధిక్కరించేవిధముగా దేనినీ చేయడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement