Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 19
19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్‌ |
నభశ్చ పృథివీం చైవ
తుములో వ్యనునాదయన్‌ ||

తాత్పర్యము : ఆ వివిధ శంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భీమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయాలను బ్రద్ధలు చేసెను.

భాష్యము : ఈ శ్లోకములో పాండవుల పక్షము వారి శం ఖానాదముల శబ్ధము ధృతరాష్ట్ర తనయుల హృదయములందు భయమును కలుగజేసినవని తెలియజేయబడినది. కానీ భీష్‌ముడు, ఇతర కౌరవులు శంఖువులను పూరించినపుడు పాండవుల వైపున అటువంటి సూచనలేమీ కనబడలేదు. దీనికి కారణం శ్రీ కృష్ణుని మీద పాండవులకు ఉన్న విశ్వాసమేనని అర్థమగుచున్నది. కాబట్టి భగవంతుడిని శరణుజొచ్చిన వ్యక్తి గొప్ప విపత్తులకు సైతము భయపడవలసిన అవసరం లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement