Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 17
17
యస్త్వాత్మరతిరేవ స్యాత్‌
ఆత్మతృప్తశ్చ మానవ: |
ఆత్మన్యేవ చ సంతుష్ట:
తస్య కార్యం న విద్యతే ||

తాత్పర్యము : కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు, ఆత్మయందే తృప్తుడే పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మమేమియును లేదు.

భాష్యము : ఎవరైతే భగవత్సేవాతత్పరుడవుతాడో అతడు యజ్ఞోద్దేశ్యమైన భగవంతుణ్ణి సంతృప్తిపరచిన వాడవుతాడు. అందుచే అతని హృదయము పవిత్రమవుతుంది. అతడు భౌతిక వాంఛల పట్ల ఆసక్తి కలిగి ఉండడు. అతడు భగవంతునితో తనకు గల శాశ్వత సంబంధములో స్థిరుడవుతాడు. అందువలన అటువంటి వ్యక్తికి విద్యుక్తధర్మములను పాటించవలసిన అవసరము ఉండదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement