Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 16
16
ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ య: |
అఘాయురింద్రియారామో
మోఘం పార్థ స జీవతి ||

తాత్పర్యము : ఓ అర్జునా ! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్దకముగా జీవనమును గడుపును.

భాష్యము : ”కష్టించి పనిచేసి, ఆ కష్టార్జితాన్ని అనుభవించు” అనే నానుడిని ఇక్కడ కృష్ణుడు స్వయముగా తిరస్కరిస్తున్నాడు. ఈ భౌతిక జగమున ఆనందింప గోరిన ప్రతివారూ పైన తెలుపబడిన యజ్ఞచక్రము ద్వారా పవిత్రీకరణ చెందవలసి యున్నది. అట్లు పాటించని యెడల వారు ప్రమాదకర జీవితాన్నే గడుపుచున్నట్లు లెక్క. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మనస్వీయ కృషిపైన కాక, దేవ తలచే ప్రత్యక్షముగా నిర్వహింపబడెడి భగవానుని ప్రణాళికపై ఆధారపడి యుండును. చివరకు ఇవన్నీ భగవత్సేవకు, ప్రేమకు దారితీయవలసి ఉన్నది. అట్లుకాని యెడల ఏ నియమములైనా సంపూర్ణములు కావు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement