Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 12
12
ఇష్టాన్‌ భోగాన్‌ హి వో దేవా
దాస్యంతే యజ్ఞభావితా: |
తైర్దత్తాన్‌ అప్రదాయైభ్యో
యో భుంక్తే స్తేన ఏవ స: ||

తాత్పర్యము : వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును.

భాష్యము : మన జీవితావసరాలైన సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి, ఆహారమునకు అంతేకాక కర్మాగారాలు, ఇతర సౌకర్యాలకు కావలసిన ముడిపదార్థాలకు, మనము భగవంతునిపై ఆధారపడి ఉన్నాము మానవుడు వీటిని తనంతట తానే సృష్టించలేడు. అయితే భగవంతుడు మనకు ఇవన్నింటినీ సరఫరా చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండా ఆత్మసాక్షాత్కారానికి వినియోగించుకుని ముక్తులమవుతాము అని. ఈ ఉద్దేశ్యాన్ని మరచి మనము వస్తు సరఫరాను కేవలము మన ఇంద్రియ వాంఛలను తీర్చుకొనుటకే ఉపయోగించినట్లయితే దొంగలవలే శిక్షార్హులమవుతాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement