Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 11
11
దేవాన్‌ భావయతానేన
తే దేవా భావయంతు వ: |
పరస్పరం భావయంత:
శ్రేయ: పరమవాప్స్యథ ||

తాత్పర్యము : యజ్ఞములచే సంతృప్తినొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు.

మన జీవిత అవసరాలైన గాలి, నీరు, వెలుతురు ఇలా సమస్తమూ దేవతల ఆధీనములో నుండును. ఆ దేవతల ప్రీత్యర్థమై యజ్ఞములను నిర్వహించుట ద్వారా జీవుడు తన అవసరాలను పొందవచ్చును. అటువంటి దేవతలందరూ భగవంతుని శరీరములో భాగముల వంటివారు మాత్రమే. అందువలన ప్రతి యజ్ఞమునకు నిజమైన అధిపతి, భోక్త విష్ణువు మాత్రమే. ఇలా సరియైన అవగాహనతో యజ్ఞములను నిర్వహించుట ద్వారా జీవన అవసరాల కొరత తొలగుటయేకాక, చివరకు భవబంధము నుండి ముక్తిని పొందవచ్చును. ఇదే నేటి సమాజమునకు పరిష్కారమార్గము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement