అధ్యాయం 3, శ్లోకం 10
10
సహయజ్ఞా: ప్రజా: సృష్ట్వా
పురోవాచ ప్రజాపతి: |
అనేన ప్రసవిష్యధ్వమ్
ఏష వో2స్త్విష్టకామధుక్ ||
తాత్పర్యము : సృష్ట్యారంభమయిన సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతలను విష్ణుప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి ”ఈ యజ్ఞములచే
మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖ జీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును” అని ఆశీర్వదించెను.
భాష్యము : ప్రజా పతియైన విష్ణువు, బద్ధజీవులను ఉద్ధరించుటకే ఈ భౌతిక సృష్టిని సృష్టించెను. భగవంతుణ్ణి మరచిపోవుటయే ఈ దుస్థితికి కారణము. కాబట్టి వేదాలు భగవంతునితో మనకు గల సంబంధాన్ని పునరుద్ధరించుటకు సహాయం చేస్తాయి. అలా ఈ సృష్టి, విష్ణుప్రీత్యర్థమే ఎలా యజ్ఞములను నిర్వహించాలో తెలియజేయుటకే ఉద్దేశించబడి ఉన్నది. ఈ కలియుగము నందు మనము చేయగలిగినది ”హరినామ సంకీర్తన” యజ్ఞమేనని వేదాలు ప్రత్యేకించి శ్రీమద్భాగవతము ఉపదేశించుచున్నవి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..