Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 8
08
నియతం కురు కర్మత్వం
కర్మ జ్యాయో హ్యకర్మణ: |
శరీరయాత్రా2పి చ తే
న ప్రసిద్ధేదకర్మణ: ||

తాత్పర్యము : నీ విద్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మకన్నను ఉత్తమమైనది. కర్మనొనరింపకుండా దేహపోషణమును సైతము మనుజుడు చేసికొనజాలడు.

భాష్యము : ఈ భౌతిక ప్రపంచములో ఉన్న వారందరికీ ఇంద్రియ భోగవాంఛలు ఉంటాయి. వాటిని శాస్త్ర నియమాల ప్రకారము జీవించుట ద్వారా పరిశుద్ధపరచాలి. ఆ విధమైన భౌతిక కల్మషము తొలగకుండా ఎవరూ కర్మను త్యజించరాదు. దేహపోషణకైననూ ఏదియో ఒకకర్మను ఒనరించవలసియున్నది కనుక శాస్త్రాధారమైన విద్యుక్త ధర్మములను కొనసాగించుటయే మేలు. అట్లుకాక జీవనార్థమై సన్యాసమును స్వీకరించుట శాస్త్ర సమ్మతము కాదు. శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఈ విధమైన మిధ్యాచారి కారాదని సూచించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement