అధ్యాయం 3, శ్లోకం 7
07
యస్త్వింద్రియాణి మనసా
నియమ్యారభతే 2ర్జున |
కర్మేంద్రియై: కర్మయోగమ్
అసక్త: స విశిష్యతే ||
తాత్పర్యము : అట్లుగాక మనస్సుచేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నంచి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తి రస భావనయందు) ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు.
భాష్యము : జీవితలక్ష్యము ఈ భవబంధముల నుండి ముక్తిని పొంది భగవద్ధామమును చేరుట, లేదా విష్ణువును చేరుట. ఈ లక్ష్యమును చేరు ఉద్దేశ్యముతోనే వర్ణాశ్రమ పద్ధతులు ఏర్పాటు చేయబడినవి. ఒక గృహస్థగా ఉంటూ కూడా శాస్త్రములలో తెలియజేయబడిన ధర్మాలననుసరించి, బంధ రహితముగా జీవించినచో క్రమేణా గమ్యమువైపునకు కొనసాగగలుగుతాడు. అటువంటి శ్రద్ధావంతుడు కపటయోగికన్ననూ ఉత్తముడు. ఆధ్యాత్మిక జీవితము పేరుతో ఎదుటివారిని మోసగించి జీవించుట కంటే నిజాయితీగా వీధులను శుభ్రపరచువాడు ఉత్తముడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..