Tuesday, November 12, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 4
04
న కర్మణామనారంభాత్‌
నైష్కర్మ్యం పురుషో శ్నుతే |
న చ సన్న్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి ||

తాత్పర్యము : కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేదు.

భాష్యము : సంసారములో మునిగి ఉన్న వ్యక్తి హృదయాన్ని పవిత్రీకరించుట శాస్త్రములలో విద్యుక్తధర్మములను ఇవ్వటం జరిగినది. అలా పాటించినవారు పునీతులై సన్యాసము స్వీకరించుటకు అర్హులవుతారు. అట్లుకాక హఠాత్తుగా సన్యాసము స్వీకరించి నారాయణులము అవుతాము అని అపోహ కలిగినవారు సమాజములో ఉత్పాతాలకు కారకులౌతారు. వాస్తవానికి ఆడంబర సన్యాసి కంటే, విద్యుక్త ధర్మాలను సైతం పాటించలేకపోయిన అల్పుడైన వ్యక్తి శాస్త్రపరమైన భగవత్సేవను రవ్వంత చేసిననూ గొప్పకష్టాల నుండి రక్షించబడతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement