Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో…)

ఆధ్యాయం 6, శ్లోకం 30

యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి
స చ మే న ప్రణశ్యతి ||

తాత్పర్యము : నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుట గాని, నాకు అతడు కనబడకపోవుట గాని జరుగదు.

భాష్యము : కృష్ణుడిని విడివడి ఏదియూ వుండదు. కృష్ణుడే సర్వానికి ప్రభువు అని తెలుసుకున్న భక్తుడు కృష్ణుడ్నే అన్నిటియందును, అంతటనూ చూసాడు. ఆ విధముగా ఎల్లప్పుడూ కృష్ణుని సాంగత్యాన్ని పొందే భక్తుడు కృష్ణునితో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండి ముక్తికి అతీతుడవుతాడు. ఆ విధముగా కృష్ణున్ని శ్యామసుందరునిగా హృదయములో దర్శించుట వలన అతడు ఎప్పటికీ పతితుడు కాలేడు. పరమాత్మను హృదయములో దర్శించే యోగి కూడా శుద్ధ భక్తుడుగా మారి క్షణ కాలపు వియోగాన్ని కూడా భరించలేకుండా ఉం టాడు. కాబట్టి అట్టి భక్తుడు ఆధ్యాత్మిక వినాశనమైన భగవంతునిలో విలీనము కావాలని ఎప్పుడూ కోరుకోడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement