Tuesday, November 26, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

ఆధ్యాయం 6, శ్లోకం 40

శ్రీ భగవాన్‌ ఉవాచ
పార్థ నైవేహ నామాత్ర
వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్‌ కశ్చిత్‌
దుర్గతిం తాత గచ ్ఛతి ||

తాత్పర్యము : శ్రీకృష్ణ భగవానుడు పలికెను : ఓ పార్థా! శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశనము పొందడు. మిత్రమా! మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు.

భాష్యము : శ్రీ నారదముని వ్యాసదేవునికి ఇట్లు ఉపదేశమిచ్చెను ”ఎవరైనా భౌతిక అవకాశాలను వదలి హరి యొక్క చరణములను ఆశ్రయించినచో అతనికి ఎటువంటి నష్ట మూ వాటిల్లదు. మిగిలనవారు తమ ధర్మాలను చక్కగా నిర్వహించిన హరి చరణములనాశ్రయించకపోతే ఏమి లాభము?” భక్తుని సేవను భగవంతుడు ఎప్పటికీ మరచిపోడని శ్రీమద్భాగవతము తెలియజేయుచున్నది. ఎంతవరకూ అతడు పురోగతి చెందుతాడో, అక్కడ నుండీ తరువాతి జ న్మలో ముందుకు కొనసాగే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement