Saturday, November 23, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

ఆధ్యాయం 6, శ్లోకం 39

ఏతన్మే సంశయం కృష్ణ
ఛేత్తుమర్హస్యశేషత: |
త్వదన్య: సంశయస్యాస్య
ఛేత్తా న హ్యుపపద్యతే ||

తాత్పర్యము : ఓ కృష్ణా! ఈ నా సందేహుమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరును లేరు.

భాష్యము : శ్రీకృష్ణుడు భూత భవిష్యత్‌ వర్తమానాలను తెలియుటలో అసమానుడు. భగవద్గీత మొదటిలోనే జీవులు భూత భవిష్యత్‌ వర్తమానాలలో వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని, ముక్తిని పొందిన తరువాత కూడా అలాగే కొనసాగుతారని తెలియజేసెను. కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించుచున్నాడు, విఫలుడైన ఆధ్యాత్మికవాది యొక్క భవిష్యత్తు ఏమిటి అని? గొప్ప గొప్ప మునులు, తత్త్వ వాదులు, ఋషులు సైతమూ త్రిగుణములతో సతమతమవుతూ ఉందురు. శ్రీకృష్ణుని భావాలు వారి భావాల కంటే ముఖ్యము. కాబట్టి శ్రీకృష్ణుని సమాధానమే పరిపూర్ణము, సర్వోత్తమము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement