ఆధ్యాయం 6, శ్లోకం 38
కచ్చిన్నోభయవిభ్రష్ట:
ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో
విమూఢో బ్రహ్మణ: పథి ||
తాత్పర్యము : ఓ మహాబాహో శ్రీకృష్ణా! ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటిని పొందినవాడై ఎచ్చోటను స్థానము లేకుండా గాలిచే చెదరిన మేఘము వలె నశింపడా?
భాష్యము : ఒక వ్యక్తి రెండు రకాలుగా పురోగతి సాధించవచ్చును. ఒకటి భౌతిక మార్గము, అనగా ధనార్జన, ఉన్నత పదవులు, లేదా స్వర్గాధిపత్యము. మరొకటి ఆధ్యాత్మిక మార్గము. భౌతిక ఆనందాన్ని త్యాగము చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొం దుట. అయితే ఆధ్యాత్మికముగా సఫలీకృతుడు కాకున్న అతడు రెండింటికీ చెడ్డ రేవడి మాత్రమే కాగలడు. ఒక్కొక్క సారి ఆకాశము నం దు మేఘములోని ఒక భాగము వేరే పెద్ద మేఘములో కలవాలని విడివడి చిన్న మేఘముగా ప్రయాణిస్తుంది. అయితే అది పెద్ద మేఘముతో జతపడే లోపే గాలికి కొట్టుకు పోయినట్లయితే దాని ఉనికి మిగిలి ఉండదు. అలాడే ‘బ్రాహ్మణ: పథి’ అనగా ఆధ్యాత్మిక మార్గములో, జీవి భగవంతునిలో అంశయని తెలిసికొని బ్రహ్మము, పరమాత్మకు ఆధారభూతుడైన భగవంతునిలో సంబంధమును పెంచుకున్నట్లయితే గమ్యాన్ని చేరుకున్నట్లు. దానికి ప్రత్యక్ష మార్గము భగవత్సేవ. మిగిలిన పద్ధతులను పాటించినట్లయితే ఈ మార్గము నుండీ వైదొలిగే అవకాశాలే ఎక్కువ.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..