Saturday, November 23, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

ఆధ్యాయం 6, శ్లోకం 37

అర్జున ఉవాచ
అయతి: శ్రద్ధయోపేతో
యోగాచ్చలితమానస: |
అప్రాప్య యోగసంసిద్ధిం
కాం గతిం కృష్ణ గచ్ఛతి ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను! ఓ కృష్ణా! తొలుత ఆత్మానుభవ విధానమును శ్రద్ధతో అనుసరించి, తరువాత లౌకికి భావన కారణముగా దానిని త్యజించి,
యోగము నందు పూర్ణత్వమును పొందలేని విఫలయోగి గమ్యమెట్టిది?

భాష్యము : ఎవరైనా ఈ భౌతిక బంధనాల నుండి బయట పడుటకు ప్రయత్నించుదురో వారిని మాయాదేవి అనేక రకాలుగా ప్రలోభ పెట్టి తన ఆధీనములోనే ఉంచుకొనుటకు ఏర్పాట్లు చేయును. ప్రతి బ ద్ధజీవి ఇప్పటికే ఎన్నోసార్లు మాయకు ఆకర్షితుడై ఉన్నాడు. కనుక ప్రస్తుతము ఆధ్యాత్మిక నియమ నిష్టలను పాటించుచున్నప్పటికీ మరొక సారి ఆకర్షితుడగుట పెద్ద కష్టము కాబోదు. దీనినే ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలగుట అందురు. అందువలన అర్జునుడు ఆ విధముగా వైదొలగిన వచ్చు పర్యవసానములేమిటొ తెలియగోరెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement