Tuesday, November 26, 2024

గౌతమి క్షమాగుణము… ఆదర్శనీయం!

ధర్మరాజు భీష్ముడితో ”పితామహా! మీరు నాకు ఎన్నో ఉపదేశించారు. కాని నా మనసుకు కొంచెం కూడా శాంతి కలుగలేదు. పట్టుబట్టి ఎంతోమందిని బంధువుల ను యుద్ధములో వధించాను. మిమ్ము అతిదారుణంగా శరతల్పగతుడిని చేసాను. ఇంతచేసిన నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? పితామహా! నేను సుయోధనుడిని రాజ్యం ఇరువురము పంచుకుని పరిపాలిద్దాము అని ప్రాధేయపడ్డాను. అతడు అందుకు సమ్మతించలేదు. నేను పట్టుదలలకు పోయి యుద్ధం చేసాను ఫలితం సర్వనాశ నం అయింది. ఈనాడు పశ్చాత్తాపపడి ప్రయోజనమేమి? ఇక నాకు దు:ఖం తప్ప శాంతి ఎలా కలుగుతుంది” అని బాధపడ్డాడు. భీష్ముడు ఊరడింపుగా ”ధర్మనందనా! చిం తించకుము అంతా దైవ నిర్ణయమే. దానిని తప్పించుట మన చేతిలో లేదు. మనము కర్తలమూ కాదు. దీనికి ఒక కథ చెప్తాను విను.”
ఒక ఊరిలో గౌతమి అనే బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒకరోజు పాము కరి చి చనిపోయాడు. అది చూసి ఆమె దు:ఖించసాగింది. అం తలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పా మును పట్టితెచ్చి ”అమ్మా! ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమంటావో చెప్పు. తలపగుల కొట్టి చంపమం టావా! లేక నిలువునా చీల్చి చంపమంటావా! నీవు ఎలా చెప్తే అలాచేస్తాను” అన్నాడు. గౌతమి ”అన్నా! విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నా కుమారుడు చనిపోయాడు. అందు కు దు:ఖించడము సహజమే అయినా! దానికి కారకులు అయినవారిని చంపడం అధ ములు చేసే పని. ఉత్తములు, ధర్మపరులు ఆ పనిచెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచిపోతారు. అన్నా! నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతు కుతాడా! దానిని విడిచిపెట్టు” అన్నది.
బోయవాడు ”అమ్మా! చంపినవాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము. కనుక ఈ పామును చంపుతాను” అని అన్నాడు. గౌతమి ”అన్నా! నీ పేరు అర్జునుకుడు. అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైనవాడివి, అమాయకుడివి నీవు ఇలా ప్రవర్తించ తగదు. అయినా నేను హంసకు ఎలా సహస్తాను” అన్నది. అమ్మా!”ఈ పామును చంపి ఈ పాము వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మము కాదా! వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలే దా! మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయలేదా! అవన్నీ ధర్మములు అయినప్పుడు. ఇది మాత్రము ఎందుకు ధర్మముకాదు. కనుక ఈ పామును చంపుటకు అంగీకరించు” అన్నాడు.
వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో ”అన్నా! ఇందు నా తప్పు ఏమీలేదు మృత్యుదేవత నన్ను ఆవహంచింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు” అని పలికింది పాము. బోయవాడు ”మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నిన్ను చంపడం తప్పు కాదు” పామును చంపబోయాడు. పాము ”అయ్యా! కుమ్మరివాడు కుండలు చేసే సమ యంలో కుండ పగిలితే తిరిగే సారెదా! కుమ్మరివాడిదా! తప్పు. అయ్యా నరులు కనప డితే నన్నే చంపుతారు కదా! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది” అన్నది. బోయవాడు ”అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నేకాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి” అన్నా డు. అందుకు పాము నవ్వి ”అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేర కు పురోహతులు చేయించినా యజ్ఞ ఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతదే కాని నాది కాదు” అన్నది.
అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి ”సర్పరాజమా! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞ ను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీలేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ య ముని చేతిలో ఉన్నాయి” అని మృత్యుదేవత పలికింది. పాము, బోయవాడితో ”అన్నా! మృత్యుదేవత మాట విన్నావు కదా! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అం టగట్టడం ధర్మమా!” అన్నది.
బోయవాడు నవ్వి ”నువ్వూ, మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవ రిని చూసినా భయము లేదు” అన్నాడు.
ఇంతలో యమ ధర్మరాజు అక్కడకు వచ్చి ”మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడా నికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మల ఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలి తంగా పుట్టుక, మరణము, సుఖము, దు:ఖముకలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించు కోలేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు, కనుక ఎవరిని నిందించవలసిన అవసరము ఏముంది”అన్నాడు.
అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమ ధర్మరాజు చెప్పడం చూసి ”అన్నా! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అను భవిస్తున్నాను. ఇది వెనుకజన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి? కనుక ఆ పామును విడిచిపెట్టు” అన్నది. ఇందరి మాట విని బోయవాడు జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచిపెట్టాడు. కనుక ”ధర్మనందనా! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలిత మే! నీవు వారి మరణానికి దు:ఖించడం వృధా!” అని చెప్పాడు. ఇలా గౌతమి తన కొడు కును చంపిన పాము మీద ఏమాత్రం కోపం, ద్వేషం పెంచు కోకుండా ప్రవర్తించింది అని, మహాభారతం, అనుశాసనిక పర్వము తెలియచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement