Tuesday, November 19, 2024

గంగారామయ…శ్రీలంకలో ఓ విహార సముదాయం

ప్రపంచంలోని అత్యంత సుందర ద్వీపాలలో శ్రీలంక ఒకటి. ఆ దేశ రాజధాని కొలంబో నడిబొడ్డున నెలకొన్నది గంగా రామయ ఆలయం. సింహళలో దీనిని శ్రీ గంగారామ మహా విహారయ అని పిలుస్తారు. కొలంబోలో ఉన్న అత్యంత ప్రముఖ దేవాలయాలలో ఇది ఒకటి. ఇది ఆధునిక వాస్తు, సాంస్కృతిక సా రాంశాల మిశ్రమంగా వెలుగొందుతోంది. ఇక్కడ దర్శనమిచ్చే శయ న బుద్ధుడు మన దేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంత పురంలో కొలువుదీరిన అనంత పద్మనాభస్వామిని తలపిస్తాడు.
శ్రీలంక, థాయ్‌, భారతీయ, చైనా నిర్మాణాల శిల్పకళా మిశ్ర మంతో నిర్మితమైన గంగారామయ ప్రధాన దేవాలయం లోపలికి అడుగుపెట్టగానే ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతాము. అక్కడ అంత అద్భుతమైన శిల్పసంపద కొలువుదీరివుంది. ఈ ఆల యం మూడు కనెక్ట్‌ చేసిన ప్లాట్‌ ఫారమ్‌లపై బీరా సరస్సుపై నిర్మిం చబడింది. శ్రీలంక ప్రసిద్ధ సమకాలీన వాస్తుశిల్పి జియోఫ్రీ బావా రూపొందించిన శ్రీలంక అటవీ ఆరామాలపై ఆధునిక ఆలయం. గంగారామయ ఆలయంలో అందుబాటులో వున్న ప్రతి స్థలంలో బౌద్ధ కథనంలోని వివిధ అంశాలకు చెందిన శిల్పాలతో నింపేందు కు ఆలయ ప్రణాళికాకర్తలు చేసిన కృషికి ధన్యవాదాలు. పదివేల మంది బుద్ధులు మనవైపు చూస్తున్న గొప్ప అనుభూతి కలుగుతుం ది. అలా వెళ్లి… ఇలా చూసి వచ్చే ఆలయం కాదు. అంతేకాదు… అక్క డున్న స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం సందర్శకు లను అలరిస్తుంది. ఈ ఆలయం మొదట చిత్తడి నేలలో ఒక చిన్న ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు విహార (ఆలయం), సెటియ (పగడ) బోధిత్రి, చైత్యం, సీమ మాలకా (సన్యాసులకు సభా మందిరం) రెలి క్‌ ఛాంబర్‌ వంటి ప్రధాన మందిరాలను కలిగివుంది. అదనంగా మ్యూజియం, లైబ్రరీ, రెసిడెన్షియల్‌ హాల్‌, మూడు అంతస్తుల విద్యామందిరాలు ఈ ప్రాంగణంలో
ఉన్నాయి. పర్యాటకులు సందర్శించవలసిన అత్యంత ముఖ్యమైన ది సీమ మలకా వాస్తు శిల్పం. దీన్ని జెఫ్రీ బావా రూపొందించారు.

ఆలయ చరిత్ర

19వ శతాబ్దానికి చెందిన షిప్పింగ్‌ వ్యాపారి డాన్‌ బాస్టియన్‌ ముదలియార్‌. ఆయన మాతర శ్రీ ధర్మరామ స్వామికి ఆలయాన్ని నిర్మించేందుకు అనువైన అందమైన భూమిని కొనుగోలుచేసి చాలా ఖర్చుతో ఆ భూమిని చదునుచేసి సిద్ధం చేశారు. ముద లియార్‌ ప్రజల సహకారంతో 30 రియాన్‌లతో కూడిన గొప్ప చైత్యను నిర్మించాడు. అనురాద పురలో కనిపించే వాటి ఆధారంగా ఒక గొప్ప అలంకార తోరణాన్ని నిర్మించాడు. అనురాద పురంలోని శ్రీ మహాబోధియ మహనీయుని నుం డి తెచ్చిన బోధి మొక్కను నాటి పెంచారు. దేవా లయం చుట్టూ మూడంతస్తుల బోధనా మంది రం, కందకాన్ని కూడా నిర్మించారు. నేడు గంగా రామయ బౌద్ధ ఆరాధన ప్రదేశంగా, అభ్యాస కేం ద్రంగా పనిచేస్తుంది. ఈ ఆలయం వృత్తి విద్యా పాఠశాల, అనాథ శరణాలయంతోసహా బౌద్ధ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటుంది. విభిన్న మతాల సభ్యులకు ఈ ఆలయం ప్రత్యేక ఆకర్ష ణగా ఉంటుంది. న్యూయార్క్‌లోని బౌద్ధ కేం ద్రం, టాంజానియాలోని బౌద్ధ కేంద్రాన్ని, స్టాటెన్‌ ఐలాండ్‌ (యుఎస్‌)లో బౌద్ధ దేవాలయా న్ని స్థాపించడంలో ఇది కీలకపాత్ర పోషించిం ది. తద్వారా ఇతర దేశాలలో దమ్మాన్ని ప్రచా రం చేయడంలో సహాయ పడుతుంది. ఈ ఆలయం బౌద్ధానికి ఒక వెలుగు, తుఫానులో చిక్కుకున్నవారికి ఓ దీపస్తంభం లాంటిది అని భావిస్తారు. 19వ శతాబ్దం చివరలో సన్‌ క్రైస్తవ మతం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తో బౌద్ధమతం క్షీణిస్తున్న సమయంలో హిక్కడువే శ్రీసు మంగళ నాయకే థెర బౌద్ధం, సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలకపాత్ర పోషించారు.
అరుదైన శిల్ప ప్రదర్శనశాల

ఆలయానికి సంబంధించిన అనేక విశిష్ట అంశాల సమాహారం ఇక్కడ వున్న మ్యూజి యం. ఈ నూతన గ్యాలరీని 2011లో శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే ప్రారంభించారు. గంగారామయ ఆలయంలోని బౌద్ధ చిత్రాలతో కూడిన ఈ ఫొటో గ్యాలరీ కళాభి మానులకు అత్యంత విలువైన వనరు. అన్ని మతపరమైన నేప థ్యాల నుండి ప్రజలకు తలుపులు తెరిచే ఆలయం. 45 సంవత్సరాల కాలంలో దేశంలోని సాంస్కృతిక, మతపరమైన ప్రదే శాలలో బౌద్ధ చిత్రాలను సేకరించి ఈ మ్యూజి యంను అభివృద్ధి చేశారు. ఈ మ్యూజియంలో అన్ని దేశాల నుంచి సేకరించిన బుద్ధ విగ్రహాలతో పాటు, పురాతన వస్తువులు కనిపిస్తాయి. ముఖ్యంగా అన్ని రకాల విలువైన రాళ్లతో మలచని బుద్ధుని విగ్రహాలు ఇక్కడ ప్రధాన ఆకర్ష ణగా నిలిచాయి. ఇక్కడ పలు దేశాలకు దమ్మాన్ని ప్రచారం చేసేం దుకు పలు కేంద్రాలను స్థాపించారు. ఈ ఆర్ట్‌ గ్యాలరీలోకి ప్రవేశించి న సందర్శకులు కాలానుసారంగా ఏర్పా టుచేసిన చారిత్రక కాలా ల్లోకి వెళ్ళిపోతారు.
ఈ క్రమం క్లాసికల్‌ పీరియడ్‌-3వ శతాబ్దం బిసిలో 13వ శతా బ్దం సిఇ (1600 సంవత్సరాల కాలం) వరకు మొదలవుతుంది. ఆ తర్వాత 450 సంవత్సరాల పాటు విస్తరించిన రాజధానులను మా ర్చే కాలం, ఆ తర్వాతీ బౌద్ధ కళల పునరుద్ధరణ, చివరిగా ఆధునికమై న కాండీ కాలం. ప్రస్తుత దేవాలయాలు, కెలనియా రాజ మహా విహారయా, బెల్లంవిలా విహార య, గోతమి విహారాల నుండి కళలు ప్రదర్శించబడే కాలాలను చూడవచ్చు. భవిష్యత్తులో ఆర్ట్‌ గ్యాలరీ సందర్శకులకు హెచ్‌ఫోన్‌లను అందించాలని భావిస్తోంది. తద్వారా వారు నడిచేటప్పుడు ఆయా చిత్రాలపై కథనాన్ని వినవచ్చు.
గంగారామయ గుడి నుంచి బయటకు వస్తే అక్కడ స్థూపం వుంటుంది (దాన్ని డాగోబా అని పిలుస్తారు) ఆ స్థూపం, దాని పరి సరాలలో మరిన్ని బుద్ధ విగ్రహాలున్నాయి. మూన్‌స్టోన్‌ క్లాసిక్‌ సింహళీ శైలిని చెబుతుంది. వితర్క ముద్ర, ధ్యానముద్ర ఇలా వివిధ ముద్రలతోవున్న కాంస్య బుద్ధులను అనేకచోట్ల కూర్చోపెట్టారు. గంగారామయ కమ్యూనిటీ వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఆలయం స్థాపించిన వివిధ పాఠశాలల్లో ఏడువేలమం దికి పైగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణా కోర్సులను అందిస్తుంది.
ఈ గంగారామయ విహారం ఎన్నటికీ మరిచిపోలేని ఓ గొప్ప అనుభూతినిచ్చింది. ఈ విహార దర్శనం ఓ ఆనంద వైభవం. బౌద్ధ ప్రపంచంలో నేను చేసిన పరిమిత ప్రయాణాలలో ఇంతకు ముం దెన్నడూ ఇలాంటి అనుభవాన్ని చవి చూడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement