Tuesday, November 26, 2024

గంగాధర విలాసం!

గంగానదికి సంబంధించిన ఇతి హాసాన్ని ‘శివలీలా విలాసము’ అ నే కావ్యంలో కూచిమంచి తిమ్మ కవి వివరించారు. ఆ కథను పాండవులు హస్తినాపురంలో ఉండగా ఒకనాడు అర్జునుడు భీష్ముడితో ”తాతా, శివు డు గంగను తన శిరస్సున ఎందుకు ధరించాడు? గంగమ్మను కొందరు జాలరుల ఇంటి ఆడపడుచుగా చెబు తారు కదా ఎందుకు? తెలుసుకోవా లని ఉంది” అని అడుగుతాడు.
అర్జునుడి మాటలకు భీష్ములు ”పుత్రా! మునుపు నారదులవారి నుండి నేను విన్న సంగతులను వివరించి చెబుతాను, సావధాన చిత్తంతో ఆలకించు!” అని, ఇలా చెప్పసాగాడు.
”బ్రహ్మదేవుడు మొదట నీటిని సృష్టించి అందులో ఒక బంగారు అండాన్ని పుట్టించాడు. ఆ అండం నుంచి సకల చరాచర జగత్తు ఒకటొక టిగా ఉద్భవించి అద్భుతంగా వృద్ధి పొందసాగింది. అలా ఉండగా, మూషికాసురుడనే సురద్వేషి ఆ అండానికి తూటు పొడిచాడు. దాంతో నీరంతా వెల్లువై ఆ అండం లోపలికి ప్రవహంచి లోకాలన్నిటినీ ముంచి వేయసాగింది. ఆ మునుకలో సకల జంతు ప్రపంచమూ ఊపిరాడక కొట్టుకుంటూ విలవిలలాడసాగింది. ఇదంతా శివుని కంట పడింది. కరు ణా సముద్రుడు కదా శివుడు! అది చూసి తాళలేక ఆ పెను వెల్లువైన గం గమ్మను పట్టి తన జటాజూటంలో బంధించి పెట్టేశాడు. గంగమ్మ శివుని జటాజూటంలో పట్టక ఉప్పొంగి పారి పెద్ద ప్రవాహంగా మారి బ్రహ్మ సృష్టించిన అండంలోకే మళ్ళీ దూరి ప్రవహంచసాగింది. శ్రీ మహావిష్ణు వు మూషికాసురుడిని సంహరించి, తన పాదాంగుష్ఠంతో ఆ బిలాన్ని మూసి పెట్టాడు. దాంతో ప్రవాహ ఉధృతి తగ్గిపో యి కొంచెం కొంచెంగా ఆ బిలానికి శ్రీహరి పాదాంగుష్ఠానికి మధ్య ఉన్న సన్నని సందులోంచి ప్రవహంచసాగింది. ఆ కాస్త ప్రవా హమే పవిత్రమైన గంగాభవానియై, పెనుప్రవాహమై జంతుకోటిని, జలచరాలను ముంచుతూ తనకు ఎవ్వరూ ఎదురు లేరనే గర్వంతో పరవళ్ళు తొక్కసాగింది. అది చూసిన శివుడు అంత గర్వా తిశయం పనికి

రాద న్నాడు. శివుడి మాటలను కూడా లెక్క చేయలేదు గంగమ్మ. అలాగే మితి మీరిన వేగంతో పరవళ్ళు తొక్కసాగింది. కోపగించిన శివుడు గం గను భూలోకానికి వెళ్ళి, చేపలను పట్టి అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళలో ఒకదానివిగా జన్మించమని అన్నాడు. ఆ మాటలతో గంగ తప్పు చేసాను, దయతో రక్షించమని ప్రార్ధించింది. ఆ ప్రార్ధనతో కరిగిపోయిన శివుడు, ‘కొన్నాళ్ళు అలా కాలం గడుపు. దేవతలందరూ మెచ్చేవిధంగా నిన్ను పెండ్లాడి దేవే రినిగా చేసుకుని తిరిగి దేవలోకానికి తెచ్చుకుంటా ను!’ అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన గంగమ్మ, భూలోకానికి వచ్చి మానవ రూపం ధరించి సముద్రతీరంలో శివుడిని గురించి తప స్సు చేయడం మొదలుపెట్టింది. అలా కాలం గడుస్తుండగా ఒకనాడు, శంఖదేవుడు అనే పేరున్న జా లరి గృహస్థుడు బంధు సమేతంగా చేపల వేటకు సముద్రంలోకి వెళు తూండగా, తీరంలో తపస్సు చేసుకుంటూ కనిపించిన గంగాభవానిని చూసి దగ్గరకు వెళ్ళి ”తల్లి, నీవెవరవు? నీ పేరే మిటి? ఏమి సాధించాలని ఈ తపస్సుకు పూనుకున్నావు?” అని అడిగా డు. ఆయన మాటలకు గంగమ్మ ”అయ్యా, నా పేరు గంగ. పరమశివుడి శాప కారణంగా భూలోకంలో జాలరి కన్నెగా పుట్టాను. ఇప్పుడు నాకు ఇంకెవరూ తెలియదు. నీవే దిక్కు కాపాడు!’ అని వేడుకుంటుంది. గం గమ్మ మాటలకు కరుణతో కరిగిపోయిన ఆ జాలరి ”అమ్మా! నీవు నీవు నాతో రా! నీకు అన్ని సౌకర్యాలు అమరుస్తాను.” అంటాడు. పిల్లల్లేని ఆ జాలరి దొరికిన గంగమ్మను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి భార్యయై న చక్రమదేవి చేతిలో పెడతాడు. ఆమె మహదానందపడి, పంచభక్ష్య పరమాన్నాలను పెడుతూ అల్లారుముద్దుగా పెంచసాగింది. ఆ జాలరి దంపతుల పెంపకంలో గంగమ్మ అనుపమాన సౌందర్యవతి అంది.
అక్కడ కైలాసంలో శంకరుడు కొలువుతీరి ఉండగా ఒకనాడు నార దుడు శివలీలా విలాసాలను ఒకటొకటిగా గానంచేస్తూ శివుడిని దర్శించు కుని వెళదామని వచ్చాడు. నారదుడిని ”జగములంతటా సౌఖ్యం నిం డి, అంతా ప్రశాంతంగానే ఉన్నదా నారదా?” అని అడుగుతాడు శంకరు డు. ”అంతా బాగానే ఉంది స్వామీ! భూలోకంలో నవయవ్వనంతో మెరి సిపోతున్న ఒక జాలరి కన్యను చూసిన దగ్గరనుంచీ మనస్సంతా సౌంద ర్యంతో నిండిపోయింది నాకు. గంగ అనే పేరుతో పిలువబడే ఆ కన్య శరీ రపు కాంతికి, తళుక్కుమని ఆకాశంలో మెరిసి క్షణంలో మాయమయ్యే మెరుపులు కూడా సాటిరావు స్వామీ!” అని చెబుతాడు. నారదుడి మాట లలోని ఉద్దేశాన్ని గ్రహంచిన శంకరుడు, జంగమ వేషంలో ఆ జాలరి కుటుంబం నివసిస్తున్న ఊరు ప్రవేశించాడు. ఆ సమయానికి గంగ తోటి యువతులతో పూలు కోస్తూ ఉంది. అంతలో జంగమ రూపంలో కనుల ఎదుట ప్రత్యక్షమైన శంకరుడిని చూసి తొట్రుపడింది. మొ#హంమీద చిరు చెమటలు కమ్మాయి. శివుడు కంగారు పడవద్దని, వివాహమాడడా నికేవచ్చానని చెబుతాడు. మొదట శంకించి నప్పటికీ, తరువాత తాను ఆ జంగమయ్యను వలచినట్లుగా గ్రహంచిన గంగమ్మ, ఆ జంగమయ్యను తప్ప వేరెవరినీ పెండ్లాడనని పెద్దవాళ్ళతో చెబుతుంది. ”అదేమి వింత కోరిక తల్లిd?’ అని ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులకు శివుడిని ప్రార్ధించి ఆయనను వారి ముందు ప్రత్యక్షమయేలా చేస్తుంది గంగ! ఆ జాలరి దం పతులు మహదానందంతో గంగను శివుడి కిచ్చి వివా#హం చేశారు. గంగ ను తిరిగి తన జటాజూటంలో దాచుకుని కైలాసం చేరాడు శివుడు!” అని అర్జునుడికి వివరించి చెప్పి కథను ముగించాడు భీష్మపితామ#హుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement