Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

గజాన న ఆవిర్భవం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యలవారి వివరణ

గజము దైవత్వానికి, మానవత్వానికి, రాక్షస త్వానికి, జ్ఞానానికి, అజ్ఞానానికి ప్రతీక. మదమెక్కిన ఏనుగు అంతా ధ్వంసం చేస్తే, అదే మంచిగా ఉన్న ఏనుగు మావటి మాట వింటుంది. నీటిలోకి దిగిన గజము స్నానమాచరించిన వెంటనే తొండముతో మట్టిని తనపై తానే పోసుకుంటుంది. ఈ గజ స్నానం అజ్ఞానానికి ప్రతీక. సర్వశక్తిమంతుడు, సర్వ రక్షకుడు, జగనియంత అయిన భగవానుడు భక్తి అన్న చిన్న అంకుశంతో భక్తసులభుడయ్యాడు అదే విధంగా బలమైన ఏనుగు కూడా చిన్న అంకుశంతో నియంత్రించబడటం దైవత్వానికి ప్రతీక. భగవంతుడు తనను కట్టేసే ‘భక్తి’ అనే తాడును ఎలాగైతే తానే ఇస్తాడో అదే విధంగా గజము కూడా తనను కట్టే తాడును తానే ఇస్తుంది. ఎలాగైతే ఏనుగు తనపై ఎక్కించుకోదలచిన వారి కోసం కాలు ముందుకు చాచునో అదే విధంగా పరమాత్మ కూడా తనను చేరదలుచుకున్న వారికి తన పాదాలను ఆశ్రయించమని తద్వారా తన వద్ద కు చేర్చుకుంటాడు.

పరమాత్మ నిత్య పరిశుద్ధుడై కూడా అనంతమైన కల్మషం నిండివున్న ఈ ప్రపంచంలోకి తనకు తానె కోరి చేరి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం, జ్ఞానము, అజ్ఞానము అన్నింటికి ప్రతీకగా నిలిచాడు. గజాసురుడు స్వార్థం, ఆశతో పొట్టలో భగవంతుడిని దాచుకుని రాక్షసత్వాన్ని చూపాడు. పరమాత్మ సందర్శనతో దాచుకున్న భ గవంతున్ని మరల ఇచ్చి మానవత్వాన్ని చాటాడు. కడుపులోని చెడును తలలోని బుద్ధి మారుస్తుంది, ఆ తల ఆదిదంపతులు తలపులతో దైవత్వాన్ని నింపుకున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement