Friday, November 22, 2024

గణేశ పురాణం

(గత సంచిక తరువాయి)

శివుడు, నామరూపాలు, గుణ తత్వ్తాలు, స్వరూప స్వభావా లు, శివార్చన, శివ సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు గూర్చి తెలియాలంటే, ఒక జన్మ చాలా? చాలదు.
నవ విధ భక్తి భావాలేవి?
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వంద నం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, భక్తి భావన.
గణశ పురాణంలో ఏమున్నాయి?
విశ్వరూపం, వంశావళి, రూపకాలు, యోగా, వే దాంత శాస్త్రం, గణశునికి సంబంధ తత్వ్తశాస్త్రం ఉన్నాయి.
గణశ పురాణ విభాగాలు ఏవి?
క్రీడాఖండం (155 అధ్యాయాలు)
ఉపాసనా ఖండం (92 అధ్యాయాలు)
క్రీడా ఖండంలో ఏమి చెప్పబడ్డాయి?
పురాణాలు, వంశావళి చెప్పబడ్డాయి.
ఉపాసనా ఖండంలో ఏమి చెప్పబడ్డాయి? వేదాంత శాస్త్రం, భక్తి చెప్పబడ్డాయి.
గణశ పురాణం ఏమి చెప్తుంది?
గణశుని సగుణ, నిర్గుణ భావనల కలయికగా చెప్తుంది. ఇందులో సగుణ గణశుడు నిర్గుణానికి నాంది.
పంచాయతన పూజలో గాణాపత్యం ఉందా?
ఉంది. గణశ పురాణం ముఖ్యంగా గణశుని తమ ప్ర ధాన దైవంగా భావించే గాణాపత్యులకు ముఖ్య గ్రంథం.
పంచాయతన పూజ అంటే?
గణశ, విష్ణు, శివ, శాక్తేయ, సూర్యుల ఆరాధన వీరిని అందరిని ప్రతి దినం ఆరాధించవచ్చు. లేదా ఒకే దేవుని ఇష్ట దైవంగా, దేవతగా కొలవవచ్చు.
శైవ మతంలోని శాఖలేవి?
అఘోరాలు, కాలామంఖులు, బైరవులు, కాపాలకులు, వీరశైవులు. నంబివారు, తంబివారు, లింగధార్లు మొదలగు శాఖలూ ఉన్నాయి.
శాక్తేయంలో ఎవరిని పూజిస్తారు?
అమ్మవారే ప్రధాన దేవత.
గణశుని ఇతర మతాలూ ఆరాధిస్తాయా?
బౌద్ధులు, జైనులు. వారి పురాణాల్లో వేదాంత శాస్త్రంలో కన్పిస్తాడు. (సశేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement