Saturday, November 23, 2024

గణేశ పురాణం

(గత సంచిక తరువాయి)

గణశుడు బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడా?
ఔను, గణశునికి ఏనుగు తల అతికించి సజీవుని చేశాక, త్రిమూర్తులు ముగ్గురూ తమతమ శక్తులను గణశునికి కొంత ఇచ్చి, సజీవుని చేసి, పార్వతిని శాంతింపచేశారు.
”స్కందుని కన్నా గణపతి ముందున్నాడు” అనే వాదన నిజమా?
కాదు. కానీ, గణశ పురాణం గణశుడు స్కంద పూర్వజుడు అని నిరూపించింది.
గణశ పురాణం ఈ వాదన సమర్థించదు ఔనా?
ఔను. స్కంద జననం జరిగిందే తారకాసుర సంహారానికి. స్కంద జననం శివ, పార్వతుల పెళ్ళి ద్వారానే జరిగింది. శివపా ర్వతుల కల్యాణం కృతయుగంలో జరిగింది. గణశ సృష్టి పార్వతీ దేవిచే త్రేతాయుగాన జరిగింది. ఋజువు ఏమిటంటే శివుని ఆత్మలింగం లంకకు చేరకుండా మారు రూపాన అడ్డుకున్నవాడు గణశుడు. మరి కృతయుగాన గణశుడు
ఏనుగు తల కల ప్రస్తుత గణశుడు కాడు. త్రేత, ద్వాపర యుగాల నాటి గణశుని మనం ప్రస్తుతం పూజిస్తున్నాం. శృంగి, భృంగి, నంది, చండీశుడు కృత యుగ గణశలు, గ ణశుడు అంటే అప్పుడు ఆ కాలాన ప్రమధ గణ నాయకుడు.
గణశుని ఎందుకు పూజించాలి?
పనులు నిర్విఘ్నంగా జరగడానికి.
గణపతి రూపాలెన్ని? ఆ రూపాల పేర్లు ఏవి?
32, 1.బాల, 2.తరుణ, 3.యువక, 4.భక్తి, 5.వీర, 6.శక్తి, 7.ద్విజ, 8.సిద్ధి, 9.ఉచ్ఛిష్ట, 10.విఘ్న, 11.క్షిపు, 12.హేరంబ, 13.శ్రీ, 14.మహా, 15.విజయ, 16.నృత్య, 17.ఊర్ధ్వ, 18.ఏకాక్షర, 19.వరీ, 20.త్యక్షరీ, 21.క్షిప్రప్ర సాద, 22.హరిద్ర, 23.ఏకదంత, 24.సృష్టి, 25.ఉద్దండ, 26.ఋణమోచన, 27.డుండి, 28.ద్విముఖి, 29. త్రి ముఖ, 30.సింహ, 31.యోగ, 32.దుర్గ, 33. సంకట హర
ఏదేవుళ్లను పూజించాలన్నా ముందు గణపతి పూజ జరపా లని, ఎవరు నిర్ణయించారు?
త్రిమూర్తులు కృతయుగంలో.

Advertisement

తాజా వార్తలు

Advertisement