Sunday, September 8, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యము (ఆడియోతో..)

గణపతి రూపంలోని రహస్యాలను గూర్చి కందాడై రామానుజాచార్యలవారి వివరణ…

గణపతికి ఉన్న రూపం మనకు అనేక సంకేతాలు, సందేశాలను అందిస్తుంది. ఆయనకున్న పెద్ద చెవులు, చిన్న క ళ్ళు ఎక్కువుగా విని తక్కువుగా చూడమని సందేశాన్నిస్తాయి. నాలుగు చేతులు, నాలుగు పురుషార్థాలకు సంకేతం కాగా చేతులలో గల ఎనిమిది ఆయుధాలు అష్టకష్టాలు తొలగించడానికే. మూషికాసురుడిని దంతంతో సంహరించడం వెనుక ఉన్న రహస్యం దాగి ఉంది. ప్రాణం ఉండి శరీరంలోని ప్రాణం లేని అవయవంతోటే మరణించాలని మూషికాసురుడికి ఉన్న వరం. ప్రాణం ఉండి
లేనిది దంతం కావున దానితోటే మూషికాసుడిని సంహరించి గణపతి ఏకదంతుడయ్యాడు. మూషకం అంటే దొంగలించేదని లేదా మనస్సు అని అర్థం. మూషకం మనం చూస్తుండగానే ఎలాగైతే అల్లకల్లోలం సృష్టించి, పదార్థాలను దొంగలిస్తుందో అదెవిధంగా మన మనస్సు కూడా మన ఆరోగ్యాన్ని, వివేకాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని
దొంగలిస్తుంది. మన ఆరోగ్యాన్ని పాడుచేసే, ఆనందాన్ని కొల్లగొట్టే వస్తువులనే మనస్సు కోరుకుంటుంది. చేయకూడని పనులనూ చేయిస్తుంది ఇలాంటి మనస్సు అనే మూషికాన్ని దంతంతోనే సంహరించాలి, ఎందుకంటే మన శరీరంలోని దంతమొక్కటే ఘనపదార్థాలను నమిలి నాలుకకు రుచిని అందిస్తుంది. రుచిని ఆస్వాదించమని మనస్సే ఆదేశిస్తుంది. గజాననుడు రుచిని అందించే దంతంతోటే మూషికాసురుడిని సంహరించాడు అంటే రుచిపై గెలుపు సాధిస్తే మూషకం(దొంగ లేదా మనస్సు) మన వశమవుతుంది. అందుకే దంతంతో సంహరించిన మూషికాసురుడు గజానుని వాహనమయ్యాడు. రుచిని అందించి మన మనస్సుకి లొంగకూడదని మూషికాసుర
సంహారం ద్వారా గణపతి మనకిచ్చిన ఉపదేశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement