ఏకదంతుడు, లంబోదరుడు, హస్తిముఖుడు, విఘ్నాధిపతి ఇలా వినాయకు డిని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకుంటారు. విఘ్నాలు తొలగించే దైవంగా, విఘ్నాధిపతిగా పూజించడం అనూచానంగా వస్తోంది. వినాయకుని గూర్చి ఎన్నో కథలు ఉన్నాయి. ఒక సందర్భంలో పరశురామునికి గణపతికి పోరా టం జరిగినట్లు ఆ యుద్ధంలోనే గణపతికి దంతం విరిగినట్టు చెబుతారు అందుకే ఆయనకు పక్క సగం దంతమే ఉంటుంది. గణేశుడికి తలను సింధూరనే రాక్షసి తల్లి గర్భంలో ఉండగానే తినేసిందని దానివల్ల ఏనుగు తల అతికించారని అందువల్లే గజ ముకుడయ్యాడని స్కాంద పురాణం చెప్తుంది. మరో కథలో పార్వతి నలుగు పిండి ముద్దతో చేసిన బాలుడికి జీవం పోసిందని అతడే గణపతి అని అంటారు.ఇలా గణ పతి గురించి ఎన్నో కథలు, పురాణాలు ఉన్నాయి. వినాయకుని పుట్టుక, ఆయనకు గజాసురుని తలను అమర్చటానికి వెనుక ఉన్న కథ ప్రతివారికీ తెలుసు. వినాయుకుడు విఘ్ననాయకుడు. వినాయకుని పూజించి ఆయనకు ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించి. ఏ పనిని తలపెట్టినా అది నిర్విఘ్నం గా పూర్తవుతుంది. ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు.
రేపు (బుధవారం) వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని గురించిన మరి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
బదరీనాధ్ వద్ద వినాయకుని గుహలు ఉన్నాయి. ఆ గుహలో వ్యాసమహర్షి భార తం చెప్తూంటే, ఘంటాన్ని ఆపకుండా గణపతి భారతాన్ని రాసాడట. కేదార్నాథ్ యా త్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుని ఆలయాన్ని దర్శిస్తారు. శ్రీశైలంలో సాక్షి గణపతిని చూడనిదే యాత్ర పూర్తికాదని చెబుతారు. శబ రిమలలో కన్నెమూల గణపతి ఎంతో ప్రసిద్ధి చెందింది. మధురలో క్షిప్ర గణపతిని ప్రతి భక్తుడు దర్శించి పూజిస్తాడు. చవితి తిథి వినాయకునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ తిథినాడు గణపతి పుట్టుక జరిగింది. వినాయకుని రూపం చూడటానికి విచిత్రం గా కనిపిస్తుంది. పెద్దపెద్ద చెవులు, పెద్ద పొట్ట, చిన్నచిన్న కళ్ళతో భక్తులకు దర్శనమి స్తాడు. విఘ్నేశ్వరుడు అనేక రూపాలను కలిగి ఉన్నాడు. విద్యనూ, జ్ఞానాన్నీ ప్రసా దించే విద్యాదైవంగానూ, నాట్యగణపతిగానూ, ఇలాగే అనేక రూపాల్లో భక్తులకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు.
ఆయన ఆకారాన్ని విచిత్రంగా భావిస్తారు. కానీ ఆయన తన రూపం ద్వారా ఎన్నె న్నో విషయాలను బోధిస్తున్నాడు. వినాయకునికి అమర్చిన ఏనుగు తలలోని తొం డం ఎంతటి బరువునైనా మోయగలదు. అంతేకాదు, ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా సాధించగలదు. తొండంతో నేలమీద పడిన ఎంతటి చిన్న వస్తువునైనా తీయగలదు. గణశుని తల విఘ్నాలన్నీ తొలగించి వారికి శుభాన్ని కలిగిస్తుంది. తొం డము ఆత్మ విశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ సంకేతం. కళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికీ సూక్ష్మదృష్టికి చిహ్నం. పెద్ద చెవులు అన్ని విషయాలనూ వినాలని, మంచి విషయా లను నేర్చుకుని వాటిని పాటించాలనీ బోధిస్తాయి. దంతాలు పరులకు హాని తల పెట్ట కూడదన్న సందేశాన్ని తెలుపుతాయి. చిన్న నోరు మితంగా మాట్లాడాలనీ, అప్రియ భాష చేయకూడదనీ, వ్యర్ధపు మాటలు నోటి వెంట రాకూడదనీ ఉపదేశిస్తాయి. గణ పతికి ఉండే నాలుగు #హస్తాలు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు సంకేతాలు. వాటిని అను సరించాలన్న భావాన్ని చెబుతాయి. ఏకదంతం చెడును తొలగించి మంచి మా ర్గాన్ని ఎన్నుకోవాలని సూచిస్తుంది. పెద్ద బొజ్జు అన్నింటినీ ప్రశాంతంగా జీర్ణించుకోవాల ని, ఇతరులు వారిని పూర్తిగా నమ్మి చెప్పిన రహస్యాలను ఉదరంలోనే నిక్షిప్తం చెయ్యాలని సలహా ఇస్తోంది. గణపతి చేతిలోని గొడ్డలి బంధాలు తెంచుకునే సాధ నం. లౌకిక జీవితంలో తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలన్న అర్ధం ఉంది. ఆయ న చేతిలో పట్టుకున్న చెరకు గడను నమిలి, రసాన్ని మింగి పిప్పిని ఉమ్మేసినట్లుగా, మంచిని, భక్తిని, ఆధ్యాత్మికతా భావాన్ని హృదయం లోపలకు తీసుకుని.. దుర్మార్గా న్ని చెడును, దుష్టతరం తలంపులను విసర్జించాలని తెలుపుతోంది.గణపతి ఎలు కను వాహనంగా ఎంచుకోవడంలో ఒక అర్ధం ఉంది. సర్వజీవులను నిర్లక్ష్యం చేయ కూడ దనీ, కోరికలను అదుపులో ఉంచుకోవాలనే భావనను ప్రకటిస్తోంది.
విఘ్నేశ్వరుడు తర్పణప్రియుడు. ఆయనకు 21 రోజులు బెల్లం పానకంతో తర్ప ణం చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము, అవాంతరాలు లేకుండా సాధించగలరు. ఈ స్వామికి ఉండ్రాళ్ళు. అరటి పళ్ళు.. బెల్లం, వడపప్పు, పానకం, కుడుములు ఎంతో ప్రీతికరమైనవి. జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితినాడు. వినాయకునికి ఇష్టమైన సంఖ్య 21 అయి నందున 21 పత్రాలతో ఆయనను పూజిస్తారు. గణపతికి గరిక అతి ప్రీతికరమైనది. గరికతో పూజిస్తే ఆయన ప్రసన్నుడై వారి కోరికలు తీరుస్తాడు. ఏ నోములు, వ్రతాలు, పూజలు చేసినా విఘ్ననాయకుడిని ముందుగా పసుపుతో చేసిన హరిద్రాగణపతిని పూజించిన తర్వాతనే మిగిలిన పూజలను ప్రారంభిస్తారు. హరిద్రా గణపతికే ప్రధమపూజ జరిపించటానికి వెనుక కూడా ఒక కారణముందని తెలుస్తోంది. పూర్వం త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు. అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వతరూపాలుగా ఉండేవారు. అయితే ఆ ముగ్గురు రాక్షసుల ను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయటానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరు డు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలు మూడింటినీ ఒకే వరుసలో నిలబెట్టారు. మూడూ ఒక చోటే ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు. కానీ, దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగి పోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వ రుని పనుపు కొమ్మును వెతికి తెచ్చి అతనికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యా లలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారుచేసి ఆ హరిద్రా గణపతికి ప్రధమ పూజ చేయాలని ఆదేశించాడు. వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు పత్నులు ఉన్నారని, బ్రహ్మ వారిద్దరినీ గణ పతికి ప్రసాదించాడనీ పురాణ కథనం. క్షీర సాగర మధనం జరపటానికి ముందుగా సురులు, అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయ కుడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు. బ్రహ్మ, దేవేంద్రుడ లక్ష్మీదేవి. విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించి లక్ష్మీదేవిలాంటి భార్య కావాలని కోరాడు. బ్రహ్మ సిద్ధిలక్ష్మి, బుద్ధి లక్ష్మి అనే ఇద్దరు స్త్రీల ను గణపతికి ఇచ్చాడు. అప్పటినుంచీ గణపతి లక్ష్మీగణపతిగా ప్రసిద్ధి చెందాడు.
- రసస్రవంతి, కావ్యసుధ 92473 13488