యాదగిరిగుట్ట, ప్రభ న్యూస్: నేటి నుండి యాదాద్రిలో భక్తులచే జరిపించ బడు ఆర్జిత సేవలు యధావిధిగా నిర్వహించ బడతాయని ఆలయ అధికారులు తెలిపారు. అధ్యయనోత్సవాల సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సువర్ణ పుష్పార్చన, శ్రీ సుదర్శన నారసింహ హోమాలు బుధవారం నుండి నిర్వహించబడతాయి.
ముగిసిన అధ్యయనోత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న అధ్యయనోత్సవా లు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవ ఆరాధనతో మంగళవారం ముగిశా యి. అలంకార ప్రియుడైన శ్రీ మహవిష్ణువుకు పూజారులు వైష్ణవ సాంప్రదా యరీతిలో పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం వేదమంత్రాలతో వివిధ అలంకార ణలతో తీర్చిదిద్ది అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే శ్రీ లక్ష్మీనరసింహుని అలంకార సేవను వేదమంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. సన్నాయి వేళాల మధ్య భక్తుల దర్శనార్ధం బాలాలయంలో ఊరేగించారు.
నేటి నుంచి యాదాద్రిలో నిత్య కల్యాణం, మొక్కు పూజలు
Advertisement
తాజా వార్తలు
Advertisement