Monday, September 16, 2024

పూర్వీకుల అనుభవసారం…మన సాంప్రదాయం!

‘సంస్కారం’ అంటే మనిషిలో ఉన్న ప్రజ్ఞనూ, శక్తినీ హెచ్చరించి నిద్రలేపి సమాజాభి వృద్ధికి ప్రజాపురోగతికి తోడ్పడుతోంది. స్త్రీ, పురుషుల వివాహం అనేది ఒక అభ యం! ఒక రక్షణ! ఒక గౌరవం! ఒక సాంప్రదాయం! నవీన నాగరిక సమాజంలో వివాహం లేకుండానే కేవలం కామ సుఖాల కోసం, ధనతా పత్రయం కోసం జీవించడం మనం చూస్తున్నాం. ఇది తప్పు! అనాగరికం! అధర్మం! అసంస్కృతి! అమర్యాద! అరాచకం!
ఏ మతం వారైనా, ఏ కులం వారైనా ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి. ఏ మతమైనా ఏ ధర్మమైనా చెడు మార్గాన్ని బోధించదు. భారత స్త్రీ లు భర్త అసమర్థుడైనా, ఎంతటి నికృష్టుడైనా ఎంతటి పాశవికుడైనా కట్టుకొన్న వాడితో జీవితం సాగించాలనుకొంటా రు. ఇదే మన భార తీ యుల

పుణ్యం. మన వివాహ వ్యవస్థ ప్రారంభమై ఎనిమిది వేల సంవత్సరాలైంది. స్త్రీ, పురుషులిద్ద ర్ని బంధించి వరుడు అగ్నికి నమస్కరించి వధువు చేతిని పట్టుకొంటూ-
”పూషాత్వేతో నయతు హస్తగృహ్వా అశ్వినౌత్వా
ప్రవహతాం రథేన గృహా నాగచ్చ గృహపత్నీ
యథాసోవశినీ త్వం వివిధం అవధాసి” అని అంటాడు.
ఓ గృహపత్నీ నా యింటికి యజమానురాలివై పెత్తనం వహించి గృహమును తీర్చిది ద్దుకొనుటకై దేవతయగు పూషాదేవి నా యింటికి నన్ను తోడ్కొని వచ్చుగాక! అశ్వనీ దేవతలు నిన్ను నా వద్దకు చేర్చుదురు గాక అని మంత్రార్థం.
”ధృవంతే రాజావరుణో ధృవంతేనో బృహస్పతి
ధృవంత ఇంద్రశ్చ అగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌”
అంటూ వేదమంత్ర పూర్వకంగా పురోహితుడు వధూవరులిద్దరికి బ్రహ్మముడి వేస్తా డు. ”ఓ నవ దంపతులారా! క్రొత్తగా దాంపత్య సామ్రాజ్యం వహించబోతున్నారు. మీకు ఇం ద్రుడు, వరుణుడు అగ్ని, బృహస్పతి దేవతలు మీ బంధాన్ని శాశ్వత ము చేయుదురు గాక” అని చెప్తోంది మంత్రం.
”శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధర్మ ప్రజా సంపత్యర్థం
స్త్రియం ఉద్వహే”
కన్యాదాన సమయంలో వరుడు కన్యను స్వీకరి స్తూ శ్రీ పరమేశ్వరుని ప్రీతికోసం ధర్మబద్ధ సంతాన సంపద కోసం ఈ కన్యను వివాహం చేసుకొనుచున్నాను అని పెద్దల సమక్షంలో చెబుతా డు. అంతేకాక వివాహానికి మహా సంక ల్పం జరుగుతుంది.
మా పూర్వీకులైన పది తరాల తాత ముత్తాతలకు శాశ్వత బ్రహ్మలోక నివా సం కల్పించడానికి ఉత్తమ సంతాన మనెడి శాశ్వత సంపద కోసం, ఈ కన్యకామణిని ధర్మంలోనూ, ధనం లోనూ, శరీర సుఖంలోనూ మోక్ష ములోనూ సగభాగమునిచ్చి అర్ధాంగిగా గౌరవిస్తున్నాను. అని చెప్పి చేసుకొనే వివాహం గొప్పది కాదా! ఇది హిందూ వ్యవస్థ గొప్పద నం కాదా! ఈ ఋషి సంస్కృతికి మిం చిన సంస్కృతి ప్రపం చంలో మరెక్కడా కన్పించదు. మామగారు కాళ్ళు కడిగి, పూ జించి, కన్యాదానం చేసి ఉత్తమ సంతానాన్ని కనమని నూరు సంవత్సరాలు అన్యోన్యంగా జీవించమని ఆశీర్వదించడం. హిందూ వివా హ పద్ధతి గౌరవించే యువకులకే స్వంతం.
ఈ సంప్రదాయాలు ఊరకనే పుట్టుకు రాలే దు. పూర్వీకుల అనుభవసారం మన సాంప్రదా యాలు! ముందు తరం వారికి ముసలితరం వారిచ్చిన అపూర్వ కానుకలు. వివాహ వేడుకలో ‘సప్తపది’ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుం ది. సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం. ”సఖాసప్తపదాభవ” ఇద్దరు ఏడడుగులు కలిసి వేస్తే ‘మిత్రత్వం’ కలుగుతోందని శాస్త్రం చెబు తోంది. పెద్దలు దీన్నే ‘ఏడడుగుల సంబంధం’ అంటారు. వరుడు వధువు నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్నిహోత్రానికి దక్షిణం వైపున నిలబడి తూర్పు దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగుపెట్టి ఏడడుగులు నడవాలి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెబుతాడు పురోహితుడు.
మొదటి అడుగు- ”ఏకం ఇషే విష్ణు: త్వా అన్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!
రెండవ అడుగు- ”ద్వే ఊర్జే విష్ణు: త్వా అన్వేతు”
ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించునట్లు చేయుగాక!
మూడవ అడుగు- ”త్రీణి వ్రతాయ విష్ణు: త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగు వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక!
నాలుగవ అడుగు- ”చత్వారి మయోభవాయ విష్ణు త్వా అన్వేతు”
ఈ నాలుగవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించుగాక!
ఐదవ అడుగు- ”పంచ పశుభ్యో విష్ణు: త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగు మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!
ఆరవ అడుగు- ”షడృతుభ్యో విష్ణు: త్వా అన్వేతు”
ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చు గాక!
ఏడవ అడుగు- ”సప్తభ్యహో తాభ్యో విష్ణ: త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!
ఎంతో చక్కని మనోహరమైన సన్నివేశమిది!
కొందరు పురోహితులు సప్తపదిని తప్పించి వేస్తుంటారు. గబగబా వివాహం అయిపో యిందనిపించుకొని మరొక ముహుర్తానికి పరుగులు తీయడం మనం చూస్తున్నాం. ఇక మన బంధువులు వాచీలు చూసుకుంటూ ”పంతులుగారూ! త్వరగా కానీయండి అవతల టయం అవుతోంది” అంటూ తొందర చెయ్యడం. ఇది మంచి పద్ధతి కాదు. పెళ్ళిని నూరేళ్ళ పంటగా భావించే జీవిత శుభకార్యాన్ని పరుగులు తీయిస్తూ చేయించడం వివేకం కాదు వివాహాన్ని ఎప్పుడూ ఆదరా బాదరగా జరిపించకూడదు. వివాహ కార్యక్రమంలో జరిపించే ఒక్కొక్క కార్యక్రమం ఎంతో మనోహరంగానూ హృదయంగమంగానూ వుంటుంది. ‘వివాహం’ పవి త్ర కార్యక్రమని చెప్పారు ఋషులు.
ఎంతటి మేధావులైనా ప్రేమ విషయంలో బుద్ధిహీనులౌతారు. ఇది చరిత్ర చెబుతున్న నిత్య సత్యం. కలల లోకంలో బ్రతికే యువతీ యువకులు సినిమా కథలన్నీ యదార్థమని భ్రమిస్తుంటారు. యవ్వనదశలో ఎవరు సక్రమంగా ఉపయోగించుకుంటారో వారే అభివృద్ధి చెంది మాతా, పితరుల పేవ చేస్తూ సమాజానికి సేవ చేయగలుగుతారు.
విమర్శించడం తప్పు గాదు ఆలోచించ లేకపోవడమే తప్పు. విమర్శనే అలవాటుగా ఉంచుకోవడం మహా తప్పు. అతి విమర్శలు మంచిది కాదు. ”లవ్‌ మ్యారేజ్‌” తప్పుగాదు. కానీ కన్నవారి ఆశీస్సులతో వారి ఆచారం ప్రకారం మాత్రమే వివాహం చేసుకోవాలి. పెద్దల అనుమతితో చేసుకొనే వివాహమే స్థిరంగా ఉంటుంది. జీవితానికి హాయినిస్తుంది. గౌరవ ప్రదంగా ఉంటుంది. మిమ్మల్ని కని పోషించిన తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గిస్తుంది.
విడాకులు అనేది హిందూ సంస్కృతిలో లేవు. కష్టసుఖాలలో కలబోసి అనుభవిస్తూ జీవించడం వివాహధర్మం. భార్యాభర్తల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. విడమర్చి వివరించి చెప్పలేనిది. మనిషిని మహోన్నతుని చేయడానికి వివాహం అనే ధర్మకార్యాన్ని ప్రవేశపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement