Friday, November 22, 2024

నేటి నుంచి యాదగిరికొండ పైకిఉచిత బస్సు సౌకర్యం

ప్రైవేటు వాహనాల నిషేధం
కొండ దిగువన పార్కింగ్‌


యాదగిరిగుట్ట, ప్రభ న్యూస్‌: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రికొండకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఉచిత రవాణా సౌకర్యాన్ని యాదాద్రి దేవస్థానం కలిపిస్తోంది. ఇందుకోసం కొండ దిగువన ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి బస్సులు కొండ పైకి చేరవేసి, మళ్లి ఉచితంగా తిరుగు ప్రయాణాన్ని అందించనుంది. ఈ విషయమై దేవస్థానం ఆలయ ఈవో ఎన్‌ గీత విలేకరులతో మాట్లాడుతూ.. రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీకి అయ్యే వ్యయం మొత్తాన్ని తమ దేవస్థానమే భరించనుందని తెలిపారు.
కొండ పైకి ప్రైవేటు వాహనాల నిషేధం
యాదాద్రి దేవస్థానం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొండ పైకి బైకులు, కార్లు తదితర ప్రైవేటు వాహనాలను నిషేధించింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమతమ వాహనాలను కొండ కిందనే పార్కింగ్‌ చేసుకొని ఆర్టీసీ ఉచిత బస్సుల్లో కొండ పైకి వెళ్లాల్సి ఉంటుంది.
రాజధాని నుంచి నేరుగా కొండ పైకి బస్సులు
ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే యాత్రికులు విధిగా కొండ కింద ఆర్టీసీ బస్టాండ్‌లో దిగి అక్కడి నుంచి దేవస్టానం, ఆర్టీసీ మినీ బస్సుల్లో కొండపైకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో యాత్రికులు లగేజీని దించుకోవడం, మళ్లిd బస్సుల్లోకి ఎక్కించుకొనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను ఆర్టీసీ తొలగించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి నేరుగా కొండ పైకి వెళ్లే ఏర్పాట్లు ఆర్టీసీ ప్రవేశపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement