మనం చేసే కర్మలు మూడు రకాలు గా వుంటాయి. అవి-
1. సంచితము- మనము చేసేసినది.
2. ప్రారబ్ధము- మనము అనుభవిస్తున్నది.
3. ఆగామి- రాబోయే, చేయబోయే కర్మ.
మరీ ఎక్కువ సంచిత పాపకర్మ వుంటే దాని ప్రభావం ఆగామి కర్మ మీద పడి పుణ్యకర్మ చేసుకోవడానికి అవకాశమే లేక పాజీవనుడౌతాడు కదా. దాని ఫలితము నీచ జన్మలు. దీనికి వైష్ణవ సిద్ధాంతం ప్రకారం భగ వంతుడు జీవుడు ఈ లోకానికి వచ్చేముందు 50 శాతం సంచితము మాత్రమే ఇచ్చి ప్రారబ్ధమనుభవించ మని మిగిలిన 50 శాతం మనకే వదిలేస్తాడు. దాని వలన సంచిత కర్మ ప్రభావం ఆగామి మీద పడుకుండా.
”ఉద్ధరీదాత్మనాత్మానం/ ఆత్మాన మవ సాదయేత్
ఆత్మైవ ఆత్మనాబంధు/ ఆత్మై వరి పురాత్మన”
అని గీతలో చెప్పిన నీ కర్మతో నాకు ఏ సంబంధము లేదంటాడు. అవసాద యేత్ నీవు ఆత్మను పడకుండా చూసుకొనుట నీ బాధ్యత అంటాడు. 50 శాతం సెకండ్ క్లాస్ మార్కులు మన చేతులో వుండుటవలన ఫస్ట్ క్లాస్ లేదా డిస్టింక్షన్ తెచ్చుకొని ఊర్శ్వలోకాలకు పోతామో లేక అధోలోకాలకు పోతామో మన ఇష్టం. యోగవాశిష్టములో వశిష్టుల వారు రాములవారికి చెబుతూ ”రామా! బలీయమైన సంకల్పబలంతో ప్రారబ్దాన్ని జయించవచ్చు” అంటాడు. రెండు బలీయమైన పొట్టేళ్ళు ఢీకొన్నప్పుడు అధిక బలంకలది విజయం సాధిస్తుంది. ప్రాక్తన కర్మ- ఆగామి. అందుకే జపతప హోమ సాధనలు. ఆగామి పొట్టేలును బలోపేతం చేయుటకొరకు కర్మ ఆద్యంతాలు పరమేశ్వరునికే తెలుసు కనుక మనము చేసే జపతపహోమ శాంతిసాధనలు చేస్తూ పోవటమే. మన సాధనను పట్టి వెంటనే లేక కాలాంతరంలో తప్పక ఫలి తమివ్వబడుతుంది.
బ్రహ్మ సూత్రభాష్యములో చెప్పినట్టు కర్మలు రెండు రకాలు. ఆరబ్ద కర్మలు. అనారబ్ద కర్మలు.
మొదటిది వదిలేసిన బాణం. ఆ కర్మ అవతార పురుషుడైనా అనుభవించాల్సిందే.
రెండవది పైన చెప్పుకున్న విధముగా ఆపవచ్చు.
– కె.రఘునాథ్
9490106490