Tuesday, September 17, 2024

రుద్రావతారుడికి…సీతమ్మ విందు!

ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆంజనేయుడు, అవతార పురు షుడు అయిన శ్రీరాముడినే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటి లేదని చాటాడు. హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ప్రతి గ్రామానికీ ఆయన క్షేత్ర పాలకుడు. అంటే గ్రామ రక్షకుడు.
అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీతాది కళల లో నిష్ణాతుడు అయిన చిరంజీవి ఆంజనేయునిపై సీతమ్మకు అమి త పుత్ర వాత్సల్యం ఉంది. తనను తిరిగి మళ్ళీ శ్రీరాముని సన్నిధికి చేర్చినది మారుతియే అని అచంచలమైన ప్రేమ సీతాదేవి హృదయ ఫలకముపై స్థిరంగా లిఖితమయింది. ఆ సంజీ వ రాయుడే లేకపోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదు కదా అని ఎల్లవేళలా అనుకునే ది. శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు చేరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. సీతాదేవి అయోధ్యా నగరానికి మహారాణి. సకల సౌభా గ్యాలతో తులతూగుతున్న సీతాదేవి హృదయం అంతా హనుమ ప ట్ల పుత్ర వాత్సల్యంతో నిండివుంది. ఒకరోజు ఆ పుత్ర వాత్సల్యంతో హనుమకు పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టాలని అను కుంది. హనుమను విందుకు ఆహ్వానించాలనుకున్న విషయాన్ని శ్రీరామునికి తెలిపింది.
సీతాదేవి మాటకు శ్రీరాముడు చిరునవ్వుతో ”సీతా! ఆంజనే యునికి నువ్వు కడుపునిండా… తృప్తిగా భోజనం పెట్టగలవా? అత డు రుద్రుడు. బాగా ఆలోచించి భోజన ఏర్పాట్లు చేసుకో” అని ముం దే హచ్చరించాడు. జానకీదేవి హనుమను మహా వీరునిగా, ఆధ్యా త్మ చింతనాపరునిగా భావించింది కాని, రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మరిచిపోయింది. హనుమను విందుకు రమ్మని ఆహ్వానించింది.
ఒక తల్లి తన పిల్లలకు ఎంత ప్రేమతో ఏర్పాట్లు చేస్తుందో అదే విధంగా సీతాదేవి హనుమకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది. తనే స్వయంగా నోరూరించే పిండి వంటలు తయా రుచేసింది. హనుమను రమ్మని ఆహ్వానించింది. వెనువెంటనే హనుమ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సీతమ్మ వేసిన విస్తరి ముందు శుఖాసీనుడై హాయిగా కూర్చున్నాడు. అన్ని పదార్ధాలను సీతాదేవి తానే వడ్డించింది. తలవంచుకుని ఆకులో వడ్డించిన పదార్థాలను వడ్డించినట్లుగా ఆంజనేయస్వామి తినేస్తున్నాడు. ఒకే పదార్ధాన్ని మళ్ళీమళ్ళీ అడిగి వేయించుకొని తినేస్తున్నాడు. వండినవన్నీ ”స్వాహా” చేసేశాడు. పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి. వంటశాల లో రాజ పరివారానికి వండించిన పదార్థాలన్నీ తెప్పించి వడ్డించిం ది. ఆ పాత్రలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. సీతమ్మకు దిక్కు తోచలేదు. కడుపునిండా తృప్తిగా తినకుండా హనుమ విస్తరి ముం దు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించలేదు.
ఆ సమయంలో ఆమెకు భర్త, హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మనస్సులో శ్రీరాముని ధ్యానించి, నమస్కరించింది. హనుమ వెనుక నిలబడి శివ పంచా క్షరి ”ఓం నమశ్శివాయ”ను జపిస్తూ శివున్ని కాసేపు ధ్యానించింది. మహా రుద్రావతారుడైన శివాత్మజుడైన #హనుమ తన రుద్ర రూపా న్ని సీతామాతకు చూపించాడు.
ఆ తదుపరి కడుపు నిండిన వాడి లాగా జుర్రున త్రేపుతూ, విస్త రి ముందు నుంచి లేచాడు. ఆంజనేయుని శివావతారాన్ని దర్శించి న సీతమ్మ పరవశురాలు అయింది. అప్పటి వరకు #హనుమపై తన కు ఉన్న సాధారణ దృష్టి అంతరించి పోయింది. సీతాదేవి హనుమ ను అత్యంత ప్రేమ, విశేష గౌరవ దృష్టితో చూడటం మొదలు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement